చర్లపల్లి, ఏప్రిల్ 16 : ధమాకా ఫేం శ్రీలీల ఎర్ర చీరలో మెరిసిపోయింది. తన అందంతో కుర్రాళ్ల గుండెల్ని పిండేసింది. నగరంలో సీఎంఆర్ స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైన ఈ ముద్దుగుమ్మను చూసిన యువ హృదయాలు పులకరించిపోయాయి.
కాలాతీత డిజైన్లకు సుప్రసిద్ధమైన సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ, బంగారు ఆభరణాలు(హెచ్‌యూఐడీ), వజ్రాలను(ఐజీఎస్)సర్టిఫికెట్తో అందించడం హర్షణీయమని సినీనటి శ్రీలీల, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఏఎస్‌రావునగర్‌లో సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యూవెలరీ హైదరాబాద్ 12వ స్టోర్స్‌ను సినీనటి శ్రీలీల, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషాసోమశేఖర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ సత్తిబాబు మాట్లాడుతూ… ఏఎస్‌రావునగర్‌లో స్టోర్స్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పావనీమణిపాల్‌రెడ్డి, కొత్త రామారావు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు కాసం మహిపాల్‌రెడ్డి, కుమార్‌స్వామి, నాయకులు బాల్‌రాజు, వెంకటేశ్వరెడ్డి, సుధాకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.