CM KCR | ఆర్టీసీని అమ్మేయాలని ప్రైజ్ మనీ పెట్టిన ఘనుడు మన ప్రధాని: సీఎం కేసీఆర్
కేంద్రం ఆకాశమెత్తు పెంచిన డీజిల్ ధరలతో ఆర్టీసీ మీద డైరెక్టుగా భారం పడుతోంది. దాదాపు 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ సంస్థను మనం బతికిస్తున్నం. ఆర్టీసీని జల్దీ అమ్మేయాలని ప్రధాని మోదీ ప్రైజ్‌లు పెట్టిన్రని సీఎం కేసీఆర్ (CMKCR) మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా మనం డీజిల్ ధర, పెట్రోల్ ధర పెంచలేదు. కానీ కేంద్రం ఆకాశమెత్తు పెంచిన డీజిల్ ధరలతో ఆర్టీసీ మీద డైరెక్టుగా భారం పడుతోంది. దాదాపు 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ సంస్థను మనం బతికిస్తున్నం. ఆర్టీసీని జల్దీ అమ్మేయాలని ప్రధాని మోదీ ప్రైజ్‌లు పెట్టిన్రని సీఎం కేసీఆర్ (CMKCR) మండిపడ్డారు.
టీఆర్ఎస్ ప్లీనరీ వేదిక (TRS Pleanary)పై కేసీఆర్ మాట్లాడుతూ…ప్రధాని ఆర్టీసీని అమ్మినోళ్లకు 1000 కోట్ల రూపాయలు బహుమతి పెట్టిండు. ఆయన అమ్మేది చాలదట. మనం కూడా అమ్ముకోవన్నట. ఉన్న సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేయండి. ఏ రాష్ట్రమైతే అమ్ముతదో ..వారికి వెయ్యి కోట్ల ప్రైజ్ మనీ పెట్టిన ఘనుడు మన ప్రధాన మంత్రి అని..ఇది జరిగే కథ. వాస్తవమని సీఎం కేసీఆర్ విమర్శించారు.
టీఆర్ఎస్ శిక్షణా శిబిరాల్లో కేంద్రం కూటనీతి, దేశం ప్రత్యామ్నాయం ఎజెండా, దేశం ముందుకు పోవాల్సిన విధానాలు, స్పష్టమైన సిలబస్ రూపకల్పన చేసి..అన్ని విషయాలు తేటతెల్లంగా తెలియజేయడం జరుగుతది. దాన్ని మళ్లీ ప్రజాక్షేత్రంలో పెట్టి ఈ దుర్మార్గుల నీతిని ఎండగట్టాలని మనవి చేస్తున్నానని పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
భయంకరమైన విషాన్ని జొప్పిస్తున్నరు..
ఏదైనా నిర్మాణం చేయాలంటే చాలా సమయం పడుతది. కానీ ఏదైనా విధ్వంసం చేయాలంటే చాలా సులభంగా చేయొచ్చు. అనేక వేలవేల సంవత్సరాల సంస్కృతి, సంప్రదాయం, సహన శీలత, ఓర్పు ఉన్నట్వంటి వైవిధ్యమైన దేశం మన భారత దేశం. 500 సంస్థానాలను విలీనం చేసుకుని ఒక ఫెడరల్ శక్తిగా ఏర్పడ్డ దేశం భారతదేశం. అలాంటి దేశంలో ఇపుడిపుడే అభివృద్ది పథంలో నడుస్తున్న తరుణంలో భయంకరమైన విషాన్ని ఈ దేశంలో జొప్పిస్తా ఉన్నరని కేంద్రంపై తీవ్రంగా ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

