Auto Driver | ఫ్రీ బస్సుతో రోడ్డు మీద బిచ్చం అడుక్కునేట్టు చేస్తున్నడు.. రేవంత్ రెడ్డిపై ఆటోడ్రైవర్ ఫైర్
Auto Driver | మాకు ఈఎంఐలు యెళ్తలేవు. స్కూల్ ఫీజులు కూడా సరిపోతలేవు. మేం చాలా పరేషాన్లో ఉన్నం. బతకాలంటే చాలా ఘోరమైపోయింది మా పరిస్థితి అని హైదరాబాద్ ఆటోడ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Auto Driver | రేవంత్ రెడ్డి జిల్లాల్లో గెలిచిండు కదా అందుకనే వాళ్లను సిటీలోకి రమ్మంటున్నడు. సిటీలో గెలవలేదని జిల్లా ఆటోలు తెలిచ్చి ఇక్కడ తిప్పుతున్నాడు. వాళ్లది రెండున్నర లక్షల ఆటో. మాది ఐదున్నర లక్షల ఆటో. వాళ్లకు పర్మిట్లేదు. న్యాయం ఎక్కడుందని హైదరాబాద్ ఆటోడ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఎంజే మార్కెట్లో ఆటోడ్రైవర్లు శనివారం ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఓ ఆటోడ్రైవర్ మాట్లాడుతూ.. మాకు ఈఎంఐలు యెళ్తలేవు. స్కూల్ ఫీజులు కూడా సరిపోతలేవు. మేం చాలా పరేషాన్లో ఉన్నం. బతకాలంటే చాలా ఘోరమైపోయింది మా పరిస్థితి. జిల్లావాళ్లు వచ్చి చాలా ఇబ్బంది చేస్తున్నరు. ఇంకో వైపు బైక్ ట్యాక్సీలు నడుస్తున్నయి. ఇంకా పోయింది.. వీడొచ్చి ఫ్రీ బస్సు అన్నడు. ఇంకా మొత్తం రోడ్డు మీద బిచ్చం అడుక్కునేట్లు చేస్తున్నడని మండిపడ్డాడు.
రూ.12 వేలు వాడేం ఇస్తడు. ఏమన్నా అంటే మా దగ్గర పైసల్లేవ్ అంటుండు. రూ.12 వేలు ఇస్తే మాకు చాయ్ పైసల్ కూడా కాదు. మేమొచ్చి పాన్, గుట్కా, చాయ్ తింటేనే రోజు 50 రూపాయలు అయితయి. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే. పోలీసోళ్లు కూడా చాలా మంది బైక్ ట్యాక్సీలు నడిపిస్తున్నరని ఆవేదన వ్యక్తం చేసిండు.
డిస్ట్రిక్ట్ ఆటోలు సిటీలోకి రాకూడదు
రేవంత్ రెడ్డి సిటీలో గెలవలేదని.. డిస్ట్రిక్ట్ ఆటోలు తెచ్చి ఇక్కడ తిప్పుతున్నాడు
మేము కనీసం EMIలు, పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టలేకపోతున్నాము
వాడు ఇస్తానన్న రూ.12 వేలు మాకు చాయి పైసలకు కూడా రావు – హైదరాబాద్ ఆటో డ్రైవర్లు https://t.co/cjwB2a2bg6 pic.twitter.com/issBm1OFsA
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2026
మార్పు మార్పు అని మా జీవితాలను రోడ్ల మీదకు తెచ్చారు
కాంగ్రెస్ ప్రభుత్యం వచ్చినప్పటి నుండి మా పరిస్థితి దారుణంగా అయింది
భార్య, పిల్లలతో సహా మేమంతా రోడ్డున పడ్డాం
పిల్లలకు ఫీజులు కట్టడానికి డబ్బులు లేక చదివించలేకపోతున్నాం – హైదరాబాద్ ఆటో డ్రైవర్ https://t.co/ILmoVoX2SF pic.twitter.com/Qy3Zw9KDFA
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2026
Read Also :
Scientists Mysterious Deaths | చైనాలో శాస్త్రవేత్తలు మృతి, అమెరికాలో అదృశ్యం.. అసలేం జరుగుతోంది?
Pappu Yadav | 70-80 శాతం రాజకీయ నేతలు పోర్న్ చూస్తారు: పప్పు యాదవ్
Arrest | కిడ్నాప్, హత్య కేసులో బెయిల్.. ఆపై పరార్.. 31 ఏళ్ల నాటి కేసులో పట్టుబడ్డ నేరగాడు..!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

