కాంగ్రెస్‌కు ఓటేస్తే.. కరెంటును కాకి ఎత్తుకుపోయినట్టే
‘ఒకడిని ఓ పెద్ద మనిషి అడిగిండట.. నువ్వెందుకు పుట్టినవ్ వంకర అంటే.. సక్కగున్నోన్ని ఎక్కిరించడానికి అన్నడట.. ఇవాళ కాంగ్రెస్ నేతల అడ్డగోలు మాటలు కూడా గిట్లేఉన్నయ్.. తెలంగాణ వచ్చినంక ఎవుసానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నం.. కాంగ్రెసోళ్లు 3 గంటల కరెంటు చాలంటుండ్రు.. కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటును కాకి ఎత్తుకుపోయినట్టే’ అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నారు.
- ఎవుసానికి 3 గంటల కరెంటు చాలంటుండ్రు
- 10 హెచ్‌పీ మోటర్లు పెట్టాలంటే పైసలెవ్వరిస్తరు
- బోర్లు, మోటర్లు కాలిపోయిన బాధలు మర్చిపోయామా ?
- అర్ధరాత్రి కరెంటుకు చనిపోయిన రైతులెందరు ?
- కాంగ్రెస్ రాజ్యంలో కాగ్నా నది నీళ్లే వడకట్టుకుని తాగిండ్రు
- తెలంగాణ వచ్చాకే తండాలకూ తాగునీళ్లు
- వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు.. ఇవాళ తలసరి విద్యుత్ వినియోగం 2200 యూనిట్లు
- కరెంటు కావాలంటే.. కారు గుర్తుకు ఓటేయండి.. బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి
- తాండూరు, పరిగి సభల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు
‘ఒకడిని ఓ పెద్ద మనిషి అడిగిండట.. నువ్వెందుకు పుట్టినవ్ వంకర అంటే.. సక్కగున్నోన్ని ఎక్కిరించడానికి అన్నడట.. ఇవాళ కాంగ్రెస్ నేతల అడ్డగోలు మాటలు కూడా గిట్లేఉన్నయ్.. తెలంగాణ వచ్చినంక ఎవుసానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నం.. కాంగ్రెసోళ్లు 3 గంటల కరెంటు చాలంటుండ్రు.. కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటును కాకి ఎత్తుకుపోయినట్టే’ అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు.
కాంగ్రెస్ పాలనలో కరెంటు కోసం ఎన్ని గోసలు పడ్డం. అర్ధరాత్రి కరెంటు కోసం పోయి తాండూరులో 40 మంది రైతులు చనిపోయారు. గ్రామాల్లో బోర్లు, మోటర్లు కాలిపోతే సర్పంచులు, ప్రజలు పడ్డ బాధలు అప్పుడే మరిచిపోయామా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాజ్యంలో కాగ్నా నది వద్ద గుంతలు తీసి వడకట్టుకుని నీళ్లు తాగేది. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కనీసం కరెంటు, మంచినీళ్లు కూడా ఇయ్యలేదని మండిపడ్డారు. పదేండ్ల తెలంగాణ ప్రభుత్వంలో మారుమూల తండాలకూ మిషన్ భగరథ నీళ్లు ఇచ్చామన్నారు. తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 2014లో 1100 యూనిట్లు ఉంటే.. ఇవ్వాళ 2200 యూనిట్లు అయిందన్నారు. కరెంటు కావాలంటే కారు గుర్తుకు ఓటేయాలని, బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

