నిజాం నవాబు ముకరం ఝాకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్
Mukaram Jha | టర్కీలోని ఇస్తాంబుల్ శనివారం రాత్రి కన్నుమూసిన ఎనిమిదో నిజాం నవాబు భర్కత్ అలీఖాన్ మకరం ఝా బహదూర్ పార్థీవ దేహాన్ని మంగళవారం హైదరాబాద్‌కు తరలించారు. చౌమహల్లా ప్యాలెస్‌లో నిజాం నవాబు
హైదరాబాద్ : టర్కీలోని ఇస్తాంబుల్ శనివారం రాత్రి కన్నుమూసిన ఎనిమిదో నిజాం నవాబు భర్కత్ అలీఖాన్ మకరం ఝా బహదూర్ పార్థీవ దేహాన్ని మంగళవారం హైదరాబాద్‌కు తరలించారు. చౌమహల్లా ప్యాలెస్‌లో నిజాం నవాబు పార్థీవదేహాన్ని ఉంచగా.. సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీజీపీ అంజనీకుమార్ సైతం ముకరం ఝాకు నివాళులర్పించారు.
ఇదిలా ఉండగా.. చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మనువడు. గత శనివారం రాత్రి ఇస్తాంబుల్‌లో కన్నుమూయగా.. ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాద్‌లోని మక్కా మసీద్‌లో ఖననం చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్యాలెస్‌లో పార్థీవదేహాన్ని సందర్శనార్థం ఉంచగా.. సందర్శనకు కుటుంబీకులు, బంధువులకు అనుమతి ఇచ్చారు. రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పార్థీవ దేహాన్ని చూసేందుకు అనుమతి ఉండగా.. మధ్యాహ్నం 2 గంటలకు ముకర్రం ఝా అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.

మక్కా మసీదుకు చేరుకున్న తర్వాత నిజాం సమాధుల పక్కనే ముకర్రం ఝా పార్థీవ దేహాన్ని ఖననం చేయనున్నారు. ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు ఆజాం ఝా టర్కీ చివరి సుల్తాన్ అబ్దుల్ మేజీద్-2 కుమార్తె దురు షెహవర్ దంపతులకు 1933 అక్టోబర్ 6న జన్మించిన ముఖరం ఝా జన్మించారు. 1971 వరకు అధికారికంగా హైదరాబాద్ యువరాజుగా కొనసాగారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

