కాంగ్రెస్ గెలిస్తే కరెంటు కాటగలుస్తది
రైతుబంధు ఓ దుబారా ఖర్చు అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్లకు ప్రజలే ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- వాళ్లొస్తే రైతు బంధుకు రాంరాం
- 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమా వచ్చే ఏడాది నుంచి
- రైతు బంధు 12 వేలు.. క్రమంగా 16 వేలకు పెంచుతాం
- సిలిండర్ 400కే ఇస్తాం
- ఆగం కాకుండా ఆలోచించి ఓటేయండి
- పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేట ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్
( న్యూస్ నెట్వర్క్- నమస్తే తెలంగాణ) ;రైతుబంధు ఓ దుబారా ఖర్చు అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్లకు ప్రజలే ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొన్నారు. అభ్యర్థులు కందాల ఉపేందర్ రెడ్డి, శంకర్ నాయక్, ఆరూరి రమేశ్‌లను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయా సభల్లో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ధ్వజమెత్తారు. ‘ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. రైతు బంధు వేస్ట్ అని అంటున్నడు. పీసీసీ అధ్యక్షుడేమో 3 గంటల కరెంటు చాలు అని అంటున్నడు. రైతు బంధు దుబారానట. రైతు బంధు వేస్ట్ అట. కాంగ్రెసోళ్లు గెలిస్తే రైతుబంధుకు రాంరాం చెబ్తరు. వాళ్లొస్తే కరెంటు కాటగలుస్తది. అందుకే ఎవరికి ఓటేయాల్నో నిర్ణయించుకోండి. రైతుబంధు వచ్చే ఏడాదికి 12 వేలు చేస్తం. క్రమంగా దాన్ని 16 వేలకు పెంచుతూ పోతం. పేదలకు ఇబ్బంది కాకుండా 400కే సిలిండర్ ఇస్తం’ అని మరోమారు సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

