CITU | కార్మికులను మోసం చేస్తున్న కేంద్రం : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
CITU | కార్మిక వ్యతిరేక విధానాలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతూ కార్మికులను మోసం చేస్తుందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు.
CITU | చర్లపల్లి, జూలై 2 : కార్మిక వ్యతిరేక విధానాలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతూ కార్మికులను మోసం చేస్తుందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. చర్లపల్లి పారిశ్రామికవాడలోని సురానా చౌరస్తా వద్ద ఇండస్ట్రీయల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక, కార్యదర్శులు సత్యనారాయణ, శ్రీనివాసులు, ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని, ముఖ్యంగా మహిళలకు రాత్రి సమయంలో డ్యూటీలు విధిస్తున్నారన్నారు. జులై తొమ్మిదవ తేదిన నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులతో పాటు అన్ని వర్గాల వారు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
జిల్లా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పించేందుకు కార్మిక సంఘాలు కృషి చేస్తున్నాయన్నారు. పారిశ్రామికవాడలలోని కార్మికులు విధిగా సమ్మెలో పాల్గొన్ని కార్మికుల హక్కులను కాపాడుకొవాలని ఆయన సూచించారు. అనంతరం యూనియన్ కార్యదర్శి శ్రీనివాసులు, సత్యనారాయణలు ప్రసగించారు.
ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా నాయకులు ప్రవీణ్, ఐఎఫ్టీయూ నాయకుడు శ్రీనివాస్, ఎపిరాక్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి మణికంఠ, వివిధ యూనియన్ల నాయకులు బాల్‌రాజు, రవీందర్‌రెడ్డి, నర్సింహ్మ, పి.శ్రీనివాస్, ఆర్.శ్రీనివాస్, సంతోష్, అదాం, నరసమ్మలతో పాటు వివిధ పరిశ్రమల కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

