ఆటిజం పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమ థెరపీ సెంటర్లు..
ఆటిజం పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమ థెరపీ సెంటర్లు – తల్లిదండ్రుల కన్నీటి పిలుపు, తక్షణం చర్య కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి!
హైదరాబాద్: ఆటిజం అనేది 21 రకాల వైకల్యాల్లో ఒకటి. ఈ వైకల్యం ఉన్న పిల్లలు చిన్న వయస్సులోనే సరైన సమయంలో గుర్తించబడితే, అవసరమైన థెరపీల ద్వారా వారి భవిష్యత్తును కాపాడవచ్చు. కానీ, ప్రభుత్వ స్థాయిలో సరైన సదుపాయాలు లేని పరిస్థితిని ఆసరాగా తీసుకొని, కావలసిన వనరులు, క్వాలిఫికేషన్స్, అనుమతులు లేని అక్రమ థెరపీ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటికి సరైన అనుమతులు లేకపోవడంతో పాటు, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫరెంట్ అబిలిటీస్ అండ్ ఎల్డర్ వెల్ఫేర్ (DDEW) విభాగం మార్గదర్శకాలు పాటించకుండా, ఆటిజం, ADHD, స్పీచ్ డిలే వంటి న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు నాసిరకం, మోసపూరిత థెరపీలు అందించడం వల్ల పిల్లల జీవితాలే ప్రశ్నార్థకమవుతూ, మంచి జరగక పోగా కీడు జరుగుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“మా పిల్లలు ఈ సెంటర్లలో సరైన చికిత్స పొందితే వారి జీవితం బావుంటుందని నమ్మి అక్కడికి వెళ్ళాం, కానీ వాస్తవానికి ఈ అక్రమ థెరపీ సెంటర్లు వారి స్వార్ధానికి మా పిల్లల తిరిగిరాని విలువైన కాలాన్ని వృధా చేస్తూ ఉసురు పోసుకుంటున్నారని, ఇలాంటి సెంటర్లను తక్షణమే మూసివేయాలని, సరైన అనుమతులు ఉన్న సెంటర్లను మాత్రమే అనుమతించాలని కోరుతున్నాం” అని ఒక తల్లి కన్నీరు పెట్టుకుంటూ పేర్కొంది.
అసలే వైకల్యంతో బాధపడుతున్న, చిన్నారుల జీవితాలతో, వారి తలిదండ్రుల, కుటుంబాలతో చెలగాటమాడుతున్నఈ అక్రమ థెరపీ సెంటర్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఈ అక్రమ థెరపీ సెంటర్లను ప్రభుత్వం వెంటనే మూసి వేయాలని ప్రజలు తల్లిదండ్రులు, ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే, ఈ సెంటర్ల వల్ల మరింత ప్రాణ నష్టం జరుగుతుంది
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

