బాలలకు మరింత రక్షణ.. శిశు విహార్

- కొవిడ్ నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు
- బయటవారి ప్రవేశాలపై ఆంక్షలు
- చిన్నారుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ
- సాధారణ అస్వస్థతకు గురైనా ఐసొలేషన్
- నేచర్ క్యూర్ హాస్పిటల్లో సిబ్బందికి ప్రత్యేక వార్డు
- హైదరాబాద్ జిల్లాలో 60 శిశు విహార్ కేంద్రాలు..
- ఆశ్రయం పొందుతున్న 2400 మంది చిన్నారులు
రకరకాల కారణాలను సాకుగా చూపుతూ కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను నగర రోడ్లపై వదిలేస్తున్నారు. పసివాళ్లన్న కనికరం లేకుండా కండ్లు తెరవక ముందే చిన్నారులను చెత్త కుండీల పాల్జేస్తున్నారు. అలాంటి వారిని ప్రభుత్వ అధికారులు అక్కున చేర్చుకుంటున్నారు. శిశు విహార్ కేంద్రాలకు తరలించి ఆలనాపాలనా చూసుకుంటున్నారు. అంతేకాక ఆప్యాయతను పంచుతున్నారు. అంతే కాదు కొవిడ్ నేపథ్యంలో శిశు విహార్ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. వైరస్ బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 60 శిశు విహార్ కేంద్రాలు ఉన్నాయి. అందులో సుమారు 2400 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. కొవిడ్ నేపథ్యంలో వారు ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా జిల్లా సంక్షేమ శాఖ అధికారులు అన్ని చర్యలను చేపట్టారు.
చిన్నారులకు మరింత భద్రత..
- శిశు విహార్ కేంద్రాల్లోని చిన్నారులకు అధికారులు ప్రత్యేక భద్రతను కల్పిస్తున్నారు.
- కొవిడ్ నేపథ్యంలో చిన్నారులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
- శిశు విహార్ కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయిస్తున్నారు.
- అందరికీ కొవిడ్ పరీక్షలను నిర్వహించారు.
- బయట నుంచి తీసుకొచ్చే పాలు, కూరగాయలను నీటితో సంపూర్ణంగా శుభ్రం చేసిన తరువాతనే లోపలికి అనుమతిస్తున్నారు.
- అదే విధంగా చిన్నారుల మధ్య భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వేడుకలపై ఆంక్షలు..
సాధారణంగా కొందరు తమ పిల్లల జన్మదిన, వివాహ తదితర ప్రత్యేకమైన రోజులను శిశు విహార్‌లోని చిన్నారులతో కలిసి జరుపుకోవడానికి ఇష్టపడతారు. అయితే, ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా బయటి వ్యక్తులను ఎవరినీ శిశు విహార్ కేంద్రాల్లోకి అనుమతించడం లేదు. ఓ వేళ అనుమతించినా అధికారులు థర్మల్ స్క్రీనింగ్, మాస్కులు లేనిదే లోనికి అడుగుపెట్టనివ్వడం లేదు. ఇలా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు పాటిస్తున్నారు.
నేచర్ క్యూర్లో ప్రత్యేక వార్డు..
- శిశు విహార్ కేంద్రాల్లోని చిన్నారులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు.
- సాధారణ జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతున్నట్లు గుర్తించిన వెంటనే చిన్నారులకు ప్రత్యేక గదిలో ఉంచుతున్నారు.
- వారు ఆరోగ్యవంతులయ్యే వరకు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
- కొవిడ్ నేపథ్యంలో చిన్నారుల రక్షణకే కాదు వారికి నిత్యం సేవలను చేస్తున్న సిబ్బంది ఆరోగ్యంపైనా అధికారులు దృష్టి సారించారు.
- వారికి కొవిడ్ టెస్టులను చేయించారు. వ్యాక్సిన్ వేయించేందుకూ చర్యలు తీసుకుంటున్నారు.
- అనారోగ్యం బారిన పడిన సిబ్బందిని విధులకు అనుమతించడం లేదు.
- అదీగాక ప్రస్తుతం వైద్యశాలలకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్న దృష్ట్యా వారికోసం నేచర్ క్యూర్ వైద్యశాలలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయించారు.
- అక్కడే సిబ్బందికి చికిత్స అందిస్తున్నారు. వారు పూర్తిగా కోలుకుంటేనే తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నారు.
చిన్నారుల రక్షణకు అన్ని చర్యలు..
శిశు విహార్ కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. బయటి వ్యక్తులను ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. సిబ్బందికి సైతం ఇప్పటికే కొవిడ్ టెస్టులు చేయించాం. త్వరలోనే వారికి వ్యాక్సిన్ వేయించాలని నిర్ణయించారు. రెండు మూడు రోజుల్లో ఆ ప్రక్రియను పూర్తి చేస్తాం. చిన్నారులకు సైతం క్రమం తప్పకుండా వారికి ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తున్నాం. – అక్కేశ్వరరావు, హైదరాబాద్ జిల్లా సంక్షేమాధికారి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

