వేడుకగా మిస్- మిస్సెస్ ఇండియా పోటీలు
మిస్- మిస్సెస్ ఇండియా పోటీలు | ఇండి- రాయల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్-మిస్సెస్ ఇండియా 2021 గ్రాండ్ ఫినాలే పోటీలు కనులపండవగా జరిగాయి.

శ్రీనగర్‌కాలనీ, ఆగస్టు 22 : ఇండి- రాయల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్-మిస్సెస్ ఇండియా 2021 గ్రాండ్ ఫినాలే పోటీలు కనులపండవగా జరిగాయి. ఆదివారం బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ హోటల్లో జరిగిన ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా అర్చనశాస్త్రి, తెలుగు ఫిల్మ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. శివశంకర్, ఆర్జేలు హాజరయ్యారు. సీజన్-6 పోటీల ప్రవేశాలకు ఈ నెలలో అన్లైన్లో నిర్వహించిన ఇంటర్వ్యూలకు వివిధ రాష్ర్టాలకు చెందిన పలువురు మహిళలు పోటీపడ్డారు.
వారి దరఖాస్తులు స్వీకరించి, ఆన్లైన్లో 42 మందిని ఎంపిక చేసి మిస్- మిస్సెస్ ఇండియా ఫైనల్ పోటీలకు ఆహ్వానించారు. పోటీలకు హాజరైన 42 మంది మహిళలు వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించారు. తమ ప్రాంతాలు, రాష్ర్టాలకు సంస్కృతిని ప్రతిబింభించేలా ప్రదర్శనలో తమదైన కళారూపాలతో మహిళలు ఆకట్టుకున్నారు. అందాల ప్రదర్శనతో పాటు సామాజిక బాధ్యతను గుర్తుచేసేలా ప్లేకార్డులను చూపారు.
వివిధ రాష్ర్టాలకు చెందిన మహిళలతో పాటు తెలుగు రాష్ర్టాలకు చెందిన వారు ఉన్నారు. ఈ పోటీల్లో మిస్ ఇండియాకు విజేతతో పాటు ఫస్ట్, సెకండ్ రన్నర్లను, మిస్సెస్ ఇండియాకు ముగ్గురు, మిస్సెస్ ఇండియా క్లాసిక్‌కు మరో ముగ్గురిని ఎంపిక చేశారు. ప్రదర్శనను తిలకించేందుకు పలువురు ప్రముఖులు, ఫేజ్ 2 సెలబ్రిటీలు హాజరయ్యారు. కార్యక్రమంలో నిర్వహకులు రోలీ త్రిపాఠి, చావి అస్థాన, అభిషేక్, ప్రీతిరెడ్డి పాల్గొన్నారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

