హైదరాబాద్ : సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. ర్యాష్ డ్రైవింగ్‌తో అదపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. సీటుబెల్ట్ పెట్టుకోవడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. అదే సమయంలో కారులో బెలూన్స్ ఓపెన్ కావడంతో డ్రైవర్‌తో పాటు పక్కనే కూర్చున్న వ్యక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేసి సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.