కేపీహెచ్‌బీ కాలనీలో.. ‘సీతాకోక చిలుక’ల పార్కు
వానకాలం వచ్చిందంటే చాలు వానజల్లులు, పిల్ల కాలువలతో పచ్చదనం వెల్లువిరుస్తుంది.
- చిలుకల వృద్ధి.. ఆహ్లాదం కోసం..
- లక్షలతో అభివృద్ధి పనులు
- రంగురంగుల పెయింటింగ్‌లు, చిలుకలను ఆకర్షించే మొక్కలు
- 6 బటర్‌ఫ్లై బెంచీలు, సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు
- త్వరలో అందుబాటులోకి వచ్చేలా చర్యలు
కేపీహెచ్‌బీ కాలనీ, ఫిబ్రవరి 24 : వానకాలం వచ్చిందంటే చాలు వానజల్లులు, పిల్ల కాలువలతో పచ్చదనం వెల్లువిరుస్తుంది. వీటితో పాటు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ గుంపులు గుంపులుగా తిరిగే రంగురంగుల సీతాకోక చిలుకలు కనువిందు చేస్తుంటాయి. ఎంత చక్కటి పూతోటైనా సీతాకోక చిలుకలు లేకపోతే అందమేరాదు. సీతాకోక చిలుకలు రంగురంగుల రెక్కలతో మనల్ని మురపించడమే కాదు పర్యావరణం పరంగా కూడా అత్యంత ప్రయోజనకారులు. సీతాకోక చిలుకల జాతులనుబట్టి ఆ ప్రాంతంలో పెరిగే మొక్కలను అంచనా వేయడం, వాతావరణ మార్పులను కూడా అంచనా వేసేందుకు దోహదం చేస్తాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన సీతాకోక చిలుకల వృద్ధి.. ప్రజలకు ఆహ్లాదం దిశగా.. కేపీహెచ్‌బీ కాలనీలో సీతాకోకచిలుకల పార్కును అందుబాటులోకి తెస్తున్నారు.

రంగురంగుల పెయింటింగ్‌లు.. ఆకర్షించే మొక్కలు..
కేపీహెచ్‌బీ కాలనీ 5వ పేజ్ రోడ్డులో రూ.11.86 లక్షలతో సీతాకోక చిలుకలు (బటర్‌ైప్లె) థీమ్ పార్కును అభివృద్ధి చేస్తున్నారు. 567 స్కేర్ మీటర్ల స్థలంలో ఓవైపు ప్రహరీ నిర్మించి ఆ గోడకు రంగురంగుల సీతాకోక చిలుకల పెయింటింగ్‌లను వేశారు. మరోవైపు సీతాకోక చిలుకలను ఆకర్షించే మొక్కలను నాటుతున్నారు. ఇగ్జోరా, లావెండర్, చైనాబాక్స్, వింకారోజియా, లాంటేనా కెమెరా (పులికంప), టెకిమా కెపిన్సిస్, కదంబ, పైసోవియా ఆల్బా, గోవర్దనగిరి, పైకాస్మాల్టిహెడ్ లాంటి విభిన్న రకాల మొక్కలను నాటుతున్నారు. ఈ మొక్కలకు అన్ని కాలాల్లో సీతాకోక చిలుకలను ఆకర్షించే గుణం ఉటుంది. ఈ మొక్కల పరిరక్షణ కోసం పార్కు చుట్టూరా రక్షణ కంచెను ఏర్పాటు చేశారు. ఈ థీమ్ పార్కులో సీతాకోక చిలుకల మాదిరిగా ఉండే ఆరు బెంచీలను అందుబాటులోకి తేనున్నారు. ఈ పార్కు ఎదుట సీతాకోక చిలుక సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
త్వరలోనే అందుబాటులోకి..
కేపీహెచ్‌బీ కాలనీలో సీతాకోక చిలుకల థీమ్ పార్కు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పార్కులో పెయింటింగ్‌లు వేయడం, సీతాకోక చిలుకలను ఆకర్షించే మొక్కలను నాటే పనులు పూర్తయ్యాయి. ఈ మొక్కల చుట్టూరా కంచెను ఏర్పాటు చేయడం జరిగింది. పార్కులో బెంచీలు, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసే పనులు చేయాల్సి ఉంది. మరో పదిహేను రోజుల్లో పనులన్నీ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణలో మొక్కలతో పాటు కీటకాలైన సీతాకోక చిలుకల పాత్ర ఎంతగానో ఉంటుంది. సీతాకోక చిలుకల వృద్ధి, ప్రజలకు ఆహ్లాదం కోసమే ఈ పసనులను చేస్తున్నాం.
– వి.మమత, జోనల్ కమిషనర్, కూకట్పల్లి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

