ఫ్లైఓవర్ పిల్లర్లకు పిండప్రదానం
సుచిత్ర-మేడ్చల్ జాతీయ రహదారిపై మూడేండ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన ైఫ్లైఓవర్ నిర్మాణ పనులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ.. బీఆర్ఎస్ నేతలు, మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం సుచిత్ర సర్కిల్లో ఫ్లైఓవర్ పిల్లర్లకు పిండ ప్రదానం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు, మెట్రోసాధన సమితి ప్రతినిధులు మాట్లాడుతూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న ఈ అత్యంత ముఖ్యమైన జాతీయ రహదారి-44పై నిత్యం వేలాది భారీ వాహనాలు ప్రయాణిస్తుంటాయన్నారు.
- బీఆర్ఎస్ నేతలు , మెట్రో సాధన సమితి ప్రతినిధుల నిరసన
కుత్బుల్లాపూర్, అక్టోబర్ 11: సుచిత్ర-మేడ్చల్ జాతీయ రహదారిపై మూడేండ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన ైఫ్లైఓవర్ నిర్మాణ పనులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ.. బీఆర్ఎస్ నేతలు, మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం సుచిత్ర సర్కిల్లో ఫ్లైఓవర్ పిల్లర్లకు పిండ ప్రదానం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు, మెట్రోసాధన సమితి ప్రతినిధులు మాట్లాడుతూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న ఈ అత్యంత ముఖ్యమైన జాతీయ రహదారి-44పై నిత్యం వేలాది భారీ వాహనాలు ప్రయాణిస్తుంటాయన్నారు.
ఈ ప్రాంతంలో నెలకొన్న తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను గుర్తించి బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నేతృత్వంలో కేంద్రంతో చర్చలు జరిపి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించారన్నారు. శ్రీనివాస ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ సంస్థ ద్వారా పిల్లర్ల నిర్మాణాలు చేపట్టిన సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పనులను నిలిపివేసిందన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు మూడేండ్లుగా నిర్మాణం పిల్లర్లకే పరిమితమైందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ నేత కుంట సిద్దిరాములు, మేడ్చల్ మెట్రోసాధన సమితి ప్రతినిధులు సంపత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జార్జ్, మోహన్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సంధ్య, రాజేశ్వర్, లక్ష్మారెడ్డి, నరేశ్నేత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

