Harish Rao | గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తతత.. హరీశ్‌రావును విడుదల చేయాలని బీఆర్ఎస్ ఆందోళన
Harish Rao | గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాజీ మంత్రి, సిద్దపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును విడుదల చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లిన సమయంలో హరీశ్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Harish Rao | గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాజీ మంత్రి, సిద్దపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును విడుదల చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లిన సమయంలో హరీశ్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులతో హరీశ్‌రావు వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత హరీశ్‌రావుతో పాటు కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి గచ్చిబౌలి పీఎస్‌కు తరలించారు. పోలీసుల విధులను అడ్డుకున్నారని.. సీఐని అడ్డగించారంటూ కౌశిక్‌రెడ్డితో పాటు పలువురిపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది.
మరో వైపు కౌశిక్‌రెడ్డి, హరీశ్‌రావుకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును అడ్డుకున్నారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డిని సైతం పోలీసులు అరెస్టు చేసి రాయదుర్గం ఠాణాకు చేరుకున్నారు. అయితే, హరీశ్‌రావు, కౌశిక్‌రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గచ్చిబౌలి పీఎస్‌కు చేరుకున్నారు. నేతల అరెస్టు సమాచారం అందుకున్న బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఠాణాకు రాగా.. ఆమెను మాత్రమే ఠాణాలోకి అనుమతించారు. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

