MLA Talasani Srinivas Yadav | మహంకాళి బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి : ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
MLA Talasani Srinivas Yadav | మహంకాళి అమ్మవారి జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
MLA Talasani Srinivas Yadav | బేగంపేట్, జూన్ 21 : మహంకాళి అమ్మవారి జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి ఆలయ పరిసరాలలో పర్యటించారు. కాలినడకన తిరుగుతూ ఆలయ పరిసరాలను పరిశీలించారు. స్థానికుల ద్వారా పలు సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముందుగా ఆలయం వద్ద పండితులు స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ ప్రభుత్వం బోనాల ఉత్సవాలకు రాష్ట్ర పండుగగా ప్రకటించిందని చెప్పారు. ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాలు అంటేనే గోల్కొండ, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీ ప్రాంతాలలో ఎంతో సందడి నెలకొంటుందని అన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం నిర్వహించే మహంకాళి అమ్మవారి జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారని అన్నారు. తెల్లవారుజామున 3 గంటల నుండే అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని అన్నారు. ఒక్క హైదరాబాద్ నగరం నుండే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. దర్శనం కోసం క్యూ లైన్ లలో వచ్చే భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన భారికేడ్ లను ఏర్పాటు చేయాలని అన్నారు.
అదేవిధంగా త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని, వాటర్ ప్యాకెట్ ల పంపిణీకి అదనపు సిబ్బందిని నియమించాలని అన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం అదనపు పోలీసు సిబ్బందితో పాటు, షీ టీమ్స్, మఫ్టీ పోలీసులను నియమించాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయ పరిసరాలలో రోడ్ల మరమ్మతులు, టాయిలెట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జోగినీలు, శివ సత్తులకు అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలతో పాటు ప్రయివేట్ దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. మహంకాళి ఆలయానికి ప్రతి సంవత్సరం బోనాల నిర్వహణ కోసం రూ. 10 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు వివరించారు.
భక్తులకు స్వచ్చందంగా సేవలు అందిస్తున్న దక్కన్ మానవ సేవాసమితి, ఆర్య సమాజ్ తదితర స్వచ్చంద సంస్థలు, స్థానిక ప్రజలు, వ్యాపారుల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బేగంపేట సర్కిల్ ఉప కమిషనర్ డాకు నాయక్, ఈ ఈ సుబ్రహ్మణ్యం, ఆర్ అండ్ బి ఈఈ రవీంద్ర మోహన్, సికింద్రాబాద్ తహసీల్దార్ పాండు నాయక్, వాటర్ వర్క్స్ జిఎం వినోద్, ఎలక్ట్రికల్ ఏడి దుర్గాప్రసాద్, మహంకాళి ఇన్స్పెక్టర్ పరశురాం, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, విజయ్ చారి, పబ్బా ప్రకాష్, సంజయ్, మహేష్ యాదవ్, మహేందర్, కోటేశ్వర్ గౌడ్, సతీష్, సత్యనారాయణ, దక్కన్ మానవ సేవ సమితి సభ్యులు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

