Kaleru Venkatesh | పదేండ్ల కేసీఆర్ పాలన స్వర్ణయుగం : ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.
Kaleru Venkatesh | పదేండ్ల కేసీఆర్ పాలన స్వర్ణ యుగంగా సాగిందని అంబర్‌పేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పేర్కొన్నారు.
Kaleru Venkatesh | కాచిగూడ, ఏప్రిల్ 27 : పదేండ్ల కేసీఆర్ పాలన స్వర్ణ యుగంగా సాగిందని అంబర్‌పేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కాచిగూడ డివిజన్ అధ్యక్షుడు ఎర్ర భీష్మదేవ్ ఆధ్వర్యంలో ఆదివారం డివిజన్లోని లింగంపల్లి చౌరస్తాలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ.. రైతుబంధు, రైతు భీమా, 24 గంటల కరెంటు, సాగునీరు, ప్రాజెక్టుల నిర్మాణం, ఐటీ కంపెనీల ఏర్పాటుతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్కతుర్తి రజతోత్సవ సభ వైపు యావత్ దేశం ఎదురు చూస్తుందని ఆయన అన్నారు. ప్రపంచంలోనే ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించిన ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని, ఎత్తిన నినాదాన్ని నిజం చేసి చూపిన అహింస ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని అన్నారు. బిఆర్ఎస్ పార్టీనే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సునీల్ బిడ్లాన్, డాక్టర్ శిరీష యాదవ్, రవీందర్ యాదవ్, నాగేందర్ బాబ్జి, బి.కృష్ణ గౌడ్, ఎల్.రమేష్, మహేష్ కుమార్, సరిత, శ్రీకాంత్ యాదవ్ పట్లూరి సతీష్ తోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorcycle Diarys | క్రేజీ కాంబో.. రిషబ్ శెట్టి, నాగవంశీ కలయికలో ‘మోటార్‌సైకిల్ డైరీస్’!
Rishab Shetty | రిషబ్ శెట్టి, నాగవంశీ కాంబినేషన్లో కొత్త సినిమా.. ‘మోటార్‌సైకిల్ డైరీస్’ ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయిందిగా!
IFFI 2026 | గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినిమా సత్తా: ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి.. ‘హనుమాన్ అంశ్’ దర్శకుడికి ప్రతిష్ఠాత్మక పురస్కారం!
Meenakshi Chaudhary | పింక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి.. !
INDIA alliance | డీలిమిటేషన్ బిల్లు వేళ కాంగ్రెస్ హై కమాండ్ కీలక నిర్ణయం.. స్టాలిన్, పవార్‌తో చర్చించనున్న ఇండియా కూటమి నేతలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

