మంత్రి శ్రీధర్‌బాబుకు మాజీ మంత్రి మల్లారెడ్డి వినతి
జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తక్షణమే తొలగించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జేఏసీ సభ్యులు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి నేతృత్వంలో మంత్రి శ్రీధర్‌బాబును గురువారం కలిసి వినతి పత్రం అందజేశారు. డంపింగ్ యార్డ్‌లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని రాంకీ సంస్థ వినియోగించకపోవడంతో చెత్త గుట్టలుగా పేరుపోతుందని మల్లారెడ్డి వివరించారు.
మేడ్చల్, నవంబర్12(నమస్తే తెలంగాణ): జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తక్షణమే తొలగించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జేఏసీ సభ్యులు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి నేతృత్వంలో మంత్రి శ్రీధర్‌బాబును గురువారం కలిసి వినతి పత్రం అందజేశారు. డంపింగ్ యార్డ్‌లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని రాంకీ సంస్థ వినియోగించకపోవడంతో చెత్త గుట్టలుగా పేరుపోతుందని మల్లారెడ్డి వివరించారు.
పేరుకుపోతున్న చెత్తను ఇష్టం వచ్చినట్లు కాలుస్తున్నారని.. దుర్వాసన విషపూరిత పొగ వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బ తింటున్నాయని తెలిపారు. రాంకీ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డంపింగ్ యార్డు నుంచి దుర్వాసన రాకుండా అనేక చర్యలు తీసుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డంపింగ్ యార్డు నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు చెత్తను ఎప్పటికప్పుడు వినియోగించేలా రూ. 1500 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ఏర్పాటు చేయించారని ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. డంపింగ్ యార్డు నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు రూ. 200 కోట్లతో శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేసి చెత్తపై క్యాపింగ్ చేసేందుకు రూ.
150 కోట్లు కేటాయించి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూశారని వివరించారు. నగరంలో నాలుగు ప్రాంతాల్లో డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. జవహర్‌నగర్, నాగారం డివిజన్లలో ఉన్న సమస్యల పరిష్కారానికి నిధులను కేటాయించాలని కోరారు. మాజీ మేయర్ కావ్య, దమ్మాయిగూడ మాజీ చైర్మన్ ప్రణీత శ్రీకాంత్‌గౌడ్, మాజీ కార్పొరేటర్లు సంగీత రాజశేఖర్, వాణి శ్రీనివాస్‌రెడ్డి డంపింగ్ యార్డు జేఏసీ సభ్యులు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

