బీఆర్ఎస్ దూకుడు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (ఉమ్మడి మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానాలు) శంఖారావాన్ని పూరించిన ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రచారంలో మరింత వేగం పెంచింది. ఇప్పటికే నియోజకర్గ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా మొదటి విడత కసరత్తు పూర్తి చేసుకున్న గులాబీ దళం, తాజాగా డివిజన్ల వారీగా రెండో విడత సమావేశాలతో క్షేత్రస్థాయిలో దూసుకుపోతుంది
- నియోజకవర్గాల వారీగా రెండో విడతగా సమావేశాలు
- ఒకవైపు కేటీఆర్..మరోవైపు పార్టీ ఎమ్మెల్యేల దిశానిర్దేశం
- దరఖాస్తుల పంపిణీ, ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్
- సర్కార్ వైఫల్యాలే అస్ర్తాలుగా స్పీడ్ పెంచిన గులాబీ దళం
- ఎన్నికల సంఘం విఫలంఓటరు నమోదు అవగాహనపై అలక్ష్యం
- అధికారుల తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం
సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (ఉమ్మడి మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానాలు) శంఖారావాన్ని పూరించిన ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రచారంలో మరింత వేగం పెంచింది. ఇప్పటికే నియోజకర్గ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా మొదటి విడత కసరత్తు పూర్తి చేసుకున్న గులాబీ దళం, తాజాగా డివిజన్ల వారీగా రెండో విడత సమావేశాలతో క్షేత్రస్థాయిలో దూసుకుపోతుంది. డివిజన్లలోని కాలనీ, ముఖ్య కూడళ్లు, పార్టీ కార్యాలయాల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి పట్టభద్రులను గుర్తించి ఆన్లైన్లో ఓటు నమోదు చేయిస్తున్నారు. ప్రత్యేకంగా ఫారమ్-18 దరఖాస్తులను పంపిణీ చేయడంతో పాటు, ఆన్లైన్ ద్వారా ఓటరు ఎన్రోల్మెంట్ వేగవంతంగా పూర్తయ్యేలా ప్రత్యేక హెల్ప్ డెస్ లను గులాబీ శ్రేణులు ఏర్పాటు చేశాయి.
కంటోన్మెంట్లో ఇన్చార్జి మన్నె క్రిశాంక్ వినూత్నంగా పట్టభద్రులను ఆకట్టుకుంటున్నారు. మిస్డ్ కాల్ చేయండి..సేవలు పొందండి అంటూ చేస్తున్న ప్రచారానికి పట్టభద్రుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. గడిచిన రెండు రోజులు ఈ తరహా ప్రచారంతో రోజూ 250కి పైగా ఓటరు నమోదు పూర్తి చేస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో నేతలు నిరుద్యోగ యువత, విద్యావంతులు, ఉద్యోగులతో సమావేశాలు నిర్వహిస్తూ ఓటు హకు నమోదుపై ముమ్మర అవగాహన కల్పిస్తున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డివిజన్ల వారీగా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి తానే స్వయంగా క్యాంపులను పర్యవేక్షిస్తూ ఓటరు నమోదును వేగం చేశారు. ఇదే సమయంలో ఎన్నికల అధికారుల తీరును ఎండగడుతూ లోపాలను పట్టభద్రులకు వివరిస్తున్నారు.
రేసులో అందరికంటే ముందే..
ఓటర్ల నమోదు ప్రక్రియలో అధికార కాంగ్రెస్, బీజేపీల కంటే బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ముందువరుసలో ఉంది.సంస్థాగత బలం, కార్యకర్తల బలగాన్ని రంగంలోకి దింపి ముందస్తు వ్యూహంతో దూసుకుపోతోంది. ఎమ్మెల్సీ స్థానాలను చేజికించుకోవడం లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందన్న విమర్శలను బీఆర్ ఎస్ ప్రధాన అస్త్రంగా మలుచుకుంది. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై వ్యక్తమవుతున్న అసంతృప్తిని ఆసరాగా చేసుకుని గ్రాడ్యుయేట్లలో విసృ్తత ప్రచారం నిర్వహిస్తోంది.
అధికార కాంగ్రెస్ వైఫల్యాలను పట్టభద్రుల వేదికగా ఎండగట్టడమే వ్యూహంగా రెండో విడత సమావేశాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం పలు నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఇన్చార్జి శంభీపూర్ రాజు పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఖైరతాబాద్‌లో మన్నె గోవర్థన్ రెడ్డి కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేశారు.. ఓటు నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు గులాబీ శ్రేణులు పకా ప్రణాళికతో ఓటరు నమోదు చేయించాలని చెప్పారు. ఈ క్రమంలోనే డివిజన్లు, వార్డుల వారీగా కార్యకర్తలను నియమించి అర్హులైన పట్టభద్రుల వివరాలు సేకరిస్తూ ‘ఫామ్-18’ దరఖాస్తులను నేరుగా అందిస్తున్నారు. డివిజన్ల వారీగా 2 వేల దరఖాస్తుల పంపిణీ లక్ష్యంగా పెట్టుకోగా చాలా వరకు సగం మేర పంపిణీ పూర్తి చేశారు. సంబంధిత దరఖాస్తులతో పాటు డిగ్రీ సర్టిఫికెట్లు, ఆధార్, గెజిటెడ్ సంతకాలతో కూడిన కాపీలను సేకరించి తీసుకుంటున్నారు. పార్టీ కా్ంయపు కార్యాలయాలు, స్థానిక కేందాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ డెస్ల ద్వారా అప్లికేషన్లను ఎన్నికల కమిషన్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు.

కనీస స్థాయి ప్రచారం చేపట్టలేదు
సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): మహబూబ్ నగర్ -రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓటర్ల నమోదు ప్రక్రియకు విశేష స్పందన లభిస్తున్నది. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, నేతలు గ్రాడ్యుయేట్లను కలిసి దరఖాస్తులను స్వీకరిస్తూ నమోదు ప్రక్రియలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ స్థానంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టభద్రులకు ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తూనే ఓటు నమోదు చేయిస్తూ , ఎన్నికల సంఘం లోపాలను నేతలు ఎత్తిచూపుతూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఓటర్లను గుర్తించి వారి ఓట్లను నమోదు చేయాల్సిన ఎన్నికల సంఘం తమ విధి నిర్వహణలో ఘోర వైఫల్యం చెందింది. ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. ఎన్నికల సంఘం బాధ్యతలను బీఆర్ఎస్ శ్రేణులు చేపడుతున్నారు.పట్టభద్రుల ఓటర్ల సంఖ్య ఈ మాత్రంగానైనా నమోదు జరిగిందంటే అందుకు బీఆర్ఎస్ శ్రేణుల చొరవ ఫలితమే. పట్టభద్రులను కనీసం తమ ఓటు నమోదు చేసుకోవాలనే ఎన్నికల సంఘం కనీస స్థాయి ప్రచారాన్ని కూడా చేపట్టలేదు. ఓటరు నమోదు గడువు సమీపిస్తున్నందున పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకోవాలి. – మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్
కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధం
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులు, విద్యార్థులు దారుణంగా మోసపోయారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి వంటి హామీలను గాలికి వదిలేసింది. ఈ ఎన్నికల్లో ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును ఆయుధంగా మార్చుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. నోటిఫికేషన్ రాకముందే క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేస్తూ, ఆన్లైన్ హెల్ప్ డెస్ల ద్వారా ఓటు నమోదును వేగవంతం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ముందుకు సాగుతున్నారు. శేరిలింగంపల్లి ఎల్లమ్మబండ గోధా కృష్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించే ఉమ్మడి అల్విన్ డివిజన్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు పాల్గొంటున్నారు.
– ఎర్రబెల్లి సతీశ్‌రావు , బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

