Link Road | కొండల్ని తొలిచి కొత్త దారులు.. ఐటీ కారిడార్‌లో లింక్రోడ్లతో తప్పిన ట్రాఫిక్ సమస్యలు
సాఫీ ప్రయాణానికి ప్రధాన రహదారులకు ప్రత్యామ్నాయంగా లింకు రోడ్లు నిర్మించి.. ట్రాఫిక్ చిక్కులు తప్పించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. గమ్యస్థానం చేరుకునేందుకు ఎత్తయిన కొండలు, బండరాళ్లు అడ్డుగా ఉన్నా.. వెనకడుగు వేయకుండా.. కొండల్ని తొలిచి.. దారులుగా మలిచింది.
Link Road | సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : సాఫీ ప్రయాణానికి ప్రధాన రహదారులకు ప్రత్యామ్నాయంగా లింకు రోడ్లు నిర్మించి.. ట్రాఫిక్ చిక్కులు తప్పించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. గమ్యస్థానం చేరుకునేందుకు ఎత్తయిన కొండలు, బండరాళ్లు అడ్డుగా ఉన్నా.. వెనకడుగు వేయకుండా.. కొండల్ని తొలిచి.. దారులుగా మలిచింది. ఆ రహదారులే ఇప్పుడు ఐటీ కారిడార్‌లో భారీ ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్. 51 నుంచి పాత ముంబై హైవే మార్గం, రాయదుర్గం నాలెడ్జ్ సిటీ నుంచి పాత ముంబై హైవే , బయోడైవర్సిటీ నుంచి ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ మీదుగా ఖాజాగూడ రోడ్డు, మణికొండ చిత్రపురికాలనీ నుంచి ల్యాంకో హిల్స్, అక్కడి నుంచి ఖాజాగూడ హిల్స్ మీదుగా ఔటర్ రింగు రోడ్డు వరకు నిర్మించిన పలు లింకు రోడ్లన్నీ కొండలు, గుట్టలతో కూడిన ప్రాంతాల మీదుగానే నిర్మించడం గమనార్హం.
నగరంలో గణనీయంగా పెరిగిన ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొండలను తొలగించి కొత్త దారులు వేసింది. ఆ దారులే నేడు నగరానికి కొత్త నడకలను నేర్పుతున్నాయి. అలా వేసినవే జూబ్లీహిల్స్ రోడ్ నం.51 నుంచి పాత ముంబాయి హైవే మార్గం, రాయదుర్గం నాలెడ్జ్ సిటీ నుంచి పాత ముంబాయి హైవే మార్గం, బయోడైవర్సిటీ నుంచి ఇంజినీరింగ్ సాప్ట్ కాలేజ్ మీదుగా ఖాజాగూడ రోడ్డు, మణికొండ చిత్రపురి కాలనీ నుంచి ల్యాంకో హిల్స్, తిరిగి అక్కడి నుంచి ఖాజాగూడ హిల్స్ మీదుగా ఔటర్ రింగు రోడ్డు వరకు నిర్మించిన పలు లింకు రోడ్లన్నీ కొండలు, గుట్టలతో కూడిన ప్రాంతాల మీదుగా నిర్మించారు. ముందుగా ఈ రోడ్లను నిర్మించడం అసాధ్యమని చెప్పినా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చొరవతో కొండలను, బండరాళ్లను లెక్క చేయలేదు. విశాలమైన లింకు రోడ్లను నిర్మించి ప్రత్యామ్నాయ రహదారులను అందుబాటులోకి తీసుకువచ్చారు.
మూడు లింకు రోడ్లతో నేరుగా ఓఆర్ఆర్కు అనుసంధానం
కోర్ సిటీలో అత్యంత కీలకమైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల నుంచి ఔటర్ రింగు రోడ్డు వరకు ట్రాఫిక్ చిక్కులు లేకుండా సాఫీగా చేరుకోవడమే లక్ష్యంగా గత ప్రభుత్వం ఒక లింకురోడ్డును ప్రతిపాదించింది. కేబీఆర్ పార్కును అనుకొని ఉన్న రోడ్డు నంబర్ 45 నుంచి నేరుగా ఓఆర్ఆర్ దాకా వెళ్లేందుకు మూడు దశల్లో లింకు రోడ్డును నిర్మించేలా ప్రతిపాదనలు రూపొందించారు. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి, మాదాపూర్ హైటెక్ సిటీ రోడ్లకు ప్రత్యామ్నాయంగా రాయదుర్గం, మణికొండ, ల్యాంకోహిల్స్, పుప్పాల్‌గూడ, ఖాజాగూడ హిల్స్ మీదుగా ఓఆర్ఆర్ వరకు మొత్తం మూడు లింకు రోడ్లను చేపట్టారు. ఈ మార్గంలో మొత్తం గుట్టలే ఉన్నాయి. అయినా వెనకడుగు వేయకుండా హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) ఇంజినీర్లు దశల వారీగా ఒక్కో లింకు రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేస్తూ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మార్గంలో ఇప్పటికే 2 లింకు రోడ్లు అందుబాటులోకి రాగా, చివరిదైన లింకు రోడ్డు ల్యాంకోహిల్స్ నుంచి ఖాజాగూడ హిల్స్, పుప్పాల్‌గూడ మీదుగా ఓఆర్ఆర్ వరకు నిర్మాణ పనులు ఇటీవలే పూర్తయి. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది.
మూడవ దశ రోడ్డు ప్రారంభమైతే..
3వ దశ లింకు రోడ్డు ప్రారంభమైతే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి నేరుగా ఓఆర్ఆర్ వరకు ఎలాంటి ట్రాఫిక్ రద్దీ, సిగ్నల్స్ వంటివి లేకుండా రాకపోకలు సాగించవచ్చు. దీంతో ఇప్పటి వరకు ప్రధాన రహదారులపై ఉన్న రద్దీ సైతం గణనీయంగా తగ్గనుందని ఇంజినీర్లు పేర్కొంటున్నారు. సరిఫడా నిధులు, ప్రతిపాదనలు ఉన్నా రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిన మార్గంలో కొండలు, పెద్ద పెద్ద బండరాళ్లతో కూడికొని ఉండడంతో తమకు సవాల్‌గా నిలిచిందని, అయినా వెనకడుగు వేయకుండా లింకు రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ల్యాంకోహిల్స్ నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మించిన లింకు రోడ్డు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నదని, త్వరలోనే వాహనదారులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

