Kidnap | సికింద్రాబాద్ స్టేషన్లో కిడ్నాపైన బాలుడి ఆచూకీ లభ్యం
Kidnap | సికింద్రాబాద్ స్టేషన్లో అపహరణకు గురైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. బాలుడిని కిడ్నాపర్ మాదాపూర్‌లో వదిలేసి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బాలుడిని అతని తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు.
Kidnap | హైదరాబాద్ : సికింద్రాబాద్ స్టేషన్లో అపహరణకు గురైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. బాలుడిని కిడ్నాపర్ మాదాపూర్‌లో వదిలేసి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బాలుడిని అతని తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా బాలుడి ఆచూకీని పోలీసులు గుర్తించారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయలపురానికి చెందిన దుర్గేశ్ బధిరుడైన తన ఐదేండ్ల కుమారుడితో కలిసి తిరుపతికి వెళ్లి వచ్చాడు. శుక్రవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ స్టేషన్‌కు దుర్గేశ్ చేరుకున్నాడు. ఆ సమయానికి తమ గ్రామానికి బస్సులు ఉండవని చెప్పి, అలసిపోయి రైల్వేస్టేషన్లో ఉండిపోయాడు. తన వస్తువులను, కుమారుడిని ఒకటో నంబర్ ప్లాట్ ఫాం వద్ద ఉంచి దుర్గేశ్ శౌచలయానికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి బాలుడు కనిపించలేదు. ఆందోళనకు గురైన తన కుమారుడి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు.. అక్కడున్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, గుర్తు తెలియని దంపతులు బాలుడిని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

