కాయ్ రాజా.. కటకటాల్లోకి..!

- బుకీగా మారిన బుక్ స్టాల్ నిర్వాహకుడు
- ఇంట్లో నుంచి యాప్‌ల ద్వారా బెట్టింగ్
- రూ.16 లక్షల విలువచేసే నగదు, సామగ్రి స్వాధీనం
- నిర్వాహకుడితో పాటు నలుగురు పందెంరాయుళ్లు అరెస్టు
సిటీబ్యూరో, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): రాచకొండ స్పెషల్ అపరేషన్ టీం మంగళవారం ఓ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకుంది. నిర్వాహకుడితో పాటు నలుగురు పందెంరాయుళ్లను అరెస్టు చేసింది. పట్టుబడ్డ వారి నుంచి 15 లక్షల నగదు, లక్ష విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకుంది. ఎల్బీనగర్లోని రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కొత్తపేట్ ప్రాంతానికి చెందిన బైరకామల్ శ్రీధర్ కోఠిలో పుస్తకాల దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద సంబ్రమ్ రామాంజనేయులు పని చేస్తున్నాడు.
శ్రీధర్ వ్యాపారంతో పాటు గత ఏడాది నుంచి సొంతంగా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు. తన ఇంట్లోనే ఓ ల్యాప్‌టాప్ ద్వారా ఆన్లైన్ క్రికెట్ యాప్‌లపై క్రికెట్ లైన్ గురు, క్రికెట్ ఎక్సేంజ్ వేదికగా బెట్టింగులను నడిపిస్తున్నాడు. ఈ బెట్టింగ్‌లకు సంబంధించి తనకు తెలిసిన వారితో పాటు తన దుకాణంలో పని చేసే రామాంజనేయులు ద్వారా వచ్చిన వారి నుంచి బెట్టింగులకు సంబంధించిన డబ్బులను వసూలు చేస్తున్నాడు.
టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్‌లపై..!
గత కొద్ది రోజులుగా ప్రారంభమైన టీ-20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లోని ఇండియా-పాక్, స్కాట్‌ల్యాండ్-అఫ్గనిస్తాన్, మ్యాచ్‌లతో పాటు మంగళవారం జరుగనున్న వెస్టిండిస్-దక్షిణాఫ్రికా, పాకిస్తాన్-న్యూజిల్యాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లపై కూడా బెట్టింగ్ రుసుం వసూలు చేశాడు. బెట్టింగ్‌కు సంబంధించిన నగదును ఆన్‌లైన్‌తో పాటు నేరుగా పందెంరాయుళ్ల నుంచే వసూలు చేస్తున్నాడు. పందెంరాయుళ్లకు వారి బెట్టింగ్ అప్షన్లను మార్చుకునేందుకు 6, 10, 15, 20 ఓవర్ల సమయంలో కూడా శ్రీధర్ అవకాశం కల్పిస్తుండటంతో చాలా మంది పందెంరాయుళ్లు పందెం కాశారు.
ఈ బెట్టింగ్‌లపై సమాచారం అందడంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రవికుమార్ నేతృత్వంలోని బృందం బైరామల్ శ్రీధర్ ఇంటిలో సోదాలు జరిపి బెట్టింగ్ గుట్టును బయటపెట్టింది. శ్రీధర్ నుంచి దాదాపు మొత్తం రూ.16 లక్షల విలువ చేసే నగదు, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీధర్‌తో పాటు రామాంజనేయులు, పందెంరాయుళ్లు జాజుల రాములు గౌడ్, బోయినపల్లి చత్రపతి, గౌని కళ్యాణ్‌లను అరెస్టు చేశారు. ఈ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేసిన ఎస్ఓటీ సిబ్బందిని సీపీ అభినందించారు. సమావేశంలో ఎస్ఓటీ డీసీపీ సురేందర్‌రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

