విదేశీ విద్యార్థులకు ఓయూలో మెరుగైన వసతులు
తురమెనిస్తాన్ ఎంబసీ ప్రతినిధి బృందం ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మంగళవారం సందర్శించింది. తురమెనిస్తాన్ కాన్సుల్ సెక్రటరీ షాహ్ముహమ్మత్ ముహమ్మదేవ్, రాయబార కార్యాలయ చాన్సరీ హెడ్ మెయిలిస్ బాషిమోవ్ నేతృత్వంలోని బృందం ఓయూ ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవీందర్,
సికింద్రాబాద్, డిసెంబర్12 : తురమెనిస్తాన్ ఎంబసీ ప్రతినిధి బృందం ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మంగళవారం సందర్శించింది. తురమెనిస్తాన్ కాన్సుల్ సెక్రటరీ షాహ్ముహమ్మత్ ముహమ్మదేవ్, రాయబార కార్యాలయ చాన్సరీ హెడ్ మెయిలిస్ బాషిమోవ్ నేతృత్వంలోని బృందం ఓయూ ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య పి. లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ఆచార్య రెడ్యానాయక్, విదేశీ విద్యార్థుల వ్యవహారాల డైరెక్టర్ ఆచార్య ఎల్. శివరామకృష్ణ, అదనపు డైరెక్టర్ ఆచార్య సరితారెడ్డి, డాక్టర్ టీవీఎస్ లక్ష్మి, ఫర్హీన్ల బృందంతో భేటీ ఆయ్యారు.
ఈ సందర్భంగా ఓయూలో విదేశీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులను ఈ సందర్భంగా ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ వివరించారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి గాను యూజీలో విద్యను అభ్యసించటానికి పద్దెనిమిది మంది, పీజీలో ఇద్దరు తురమెనిస్తాన్ విద్యార్థులు ఓయూలో విద్యాభ్యాసం చేస్తున్నారని ఆచార్య శివరామకృష్ణ వివరించారు. వివిధ దేశాలకు చెందిన మరో 50 మంది విద్యార్థులు ఓయూ పరిధిలో చదువుకుంటున్నారని వెల్లడించారు. విదేశీ విద్యార్థులకు సంబంధించిన విద్యా సంబంధిత అవకాశాలు, వసతులపై ఈ సందర్భంగా ఆయన వివరణ ఇచ్చారు. అనంతరం తురమెనిస్తాన్ విద్యార్థులు, ఓయూలోని ఎంబసీ సభ్యులు,అడ్మినిస్ట్రేషన్ సభ్యుల మధ్య పరస్పర చర్చా కార్యక్రమం జరిగింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

