Benz Car | బంజారాహిల్స్‌లో బెంజ్‌కారు బీభత్సం.. మద్యం మత్తులో మహిళా డ్రైవర్!
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బెంజ్ కారు (Benz Car) బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం అతివేగంగా దూసుకొచ్చిన కారు బంజారాహిల్స్ సిటీ సెంటర్ షాపింగ్‌మాల్ వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బెంజ్ కారు (Benz Car) బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం అతివేగంగా దూసుకొచ్చిన కారు బంజారాహిల్స్ సిటీ సెంటర్ షాపింగ్‌మాల్ వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడంతో కారును నడుపుతున్న మహిళ క్షేమంగా బయట పడ్డారు. అందులోనుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్న ఆమెను వాహనదారులు రక్షించారు. అతికష్టంపై ఆమెను బయటకు తీసుకొచ్చారు. ఆమె మద్యం మత్తులో ఉన్నట్లుగా గుర్తించిన వారు.. పోలీసులకు సమాచారం అందిచారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన కారును అక్కడి నుంచి తరలించారు. మూల మలుపు వద్ద కారు వేగాన్ని నియంత్రించక పోవడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే ఆ కారు, మహిళా డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man pushed Woman Under train | రైలులో మహిళను వేధించిన వ్యక్తి.. అతడు తోయడంతో రైలు కిందపడి చేయి కోల్పోయిన యువతి
‘ప్రతి ఒక్కరు కేవైసీ చేయించుకోవాలి’
IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా మహేష్ భగావత్
Siddharth Galla | మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. ఇటలీలో కొరియన్ అమ్మాయితో ఏడడుగులు, ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!
Quality coal | నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే సంస్థ మనుగడ సాధ్యం : ఆర్జీ జీఎం లలిత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

