సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ పరిధిలోని డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు కేటుగాళ్లు టోకరా వేస్తున్నారు. వెబ్సైట్లో లబ్ధిదారుల డేటా సేకరించి, మీకు నల్లా కనెక్షన్, కరెంట్ మీటర్ ఇప్పిస్తామని ఫోన్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు.
నల్లా కనెక్షన్‌కు రూ. 1250లను యూపీఐ ద్వారా చెల్లించాలని కుచ్చుటోపీ పెడుతున్నారు. రెండు రోజులుగా 72960 57957, 7463086318 నంబర్ల నుంచి లబ్ధిదారులకు కాల్స్ వస్తున్నాయని, ఇటువంటి కేటుగాళ్ల బారిన పడొద్దని పోలీస్‌లు, జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.