పచ్చటి వనాల్లోనే ప్రథమ వేడుక
బుడిబుడి నడకలు.. బోసి నవ్వులు.. వచ్చీరాని పలుకులు.. హావాభావాలతో చిరునవ్వులు చిందిస్తూ ఇంటిల్లిపాదిని ఆనందపరవశంలో ముంచెత్తే చిన్నారులుంటే ఎంతో ముద్దు చేస్తారు. ఇక వారి మొదటి పుట్టినరోజును ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
- పుట్టిన రోజు వేడుకలకు వేదికగా పార్కులు
- చిన్నారుల ఫొటో షూట్లు, ఈవెంట్లు
- గ్రీనరీ ట్రెండ్‌కే తల్లిదండ్రుల ప్రాధాన్యం
సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ)/కందుకూరు : బుడిబుడి నడకలు.. బోసి నవ్వులు.. వచ్చీరాని పలుకులు.. హావాభావాలతో చిరునవ్వులు చిందిస్తూ ఇంటిల్లిపాదిని ఆనందపరవశంలో ముంచెత్తే చిన్నారులుంటే ఎంతో ముద్దు చేస్తారు. ఇక వారి మొదటి పుట్టినరోజును ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇటీవల తల్లిదండ్రులు తమ చిన్నారుల ప్రథమ జన్మదిన వేడుకలను పచ్చటి వనాల్లో నిర్వహించేందుకు మక్కువ చూపుతున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పర్యాటక ప్రాంతాలు, పార్కులు, హరితవనాలవైపు అడుగులేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం హరితహారంలో నాటిన మొక్కలు.. అర్బన్ ఫారెస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో పట్టణ పార్కులను సుందరీకరణ చేసిన సందర్భంగా చిన్నారుల పుట్టిన రోజు వేడుకలకు వేదికలుగా నిలుస్తుండటం విశేషం.

ఆకుపచ్చని వేదికపై ఫొటో షూట్..
- కాలనీల్లో ఉన్న పార్కులను అందంగా తీర్చిదిద్దడంతో బర్త్‌డే వేడుకల్లో భాగంగా ఫొటో షూట్లకు వేదికలుగా మారుతున్నాయి. నగరవ్యాప్తంగా అనేక గ్రీనరీలను చుట్టి వస్తున్నారు. ప్రకృతి ఒడిలో ఎదురయ్యే ప్రతిక్షణాన్ని సంతోషంగా ఆస్వాదిస్తున్నారు.
- అక్కడ చిన్నారులను విభిన్నంగా ఫొటోలు తీస్తున్నారు. పిల్లలకు కనీసం ఆరు నుంచి పది జతల డ్రెస్సులతో విభిన్న స్టిల్స్ తీసుకుంటున్నారు. అందులో డాక్టర్, పోలీస్, లాయర్, సంప్రదాయ దుస్తుల వేశాధారణలో చిన్నారులను ఫొటోలు తీసి మధుర జ్ఞాపకంగా పదిలపరుచుకుంటున్నారు.
బోసిపోయిన పార్కే.. నేడు పచ్చబడింది
ముషీరాబాద్‌లోని మా ఇంటి దగ్గరి పార్కు బోసిపోయి ఉండేది. అందువల్ల మేము నారాయణగూడలోని వైఎంసీఏ పార్కుకు వెళ్లేవాళ్లం. ఒకప్పుడు బోసిపోయిన పార్కే.. నేడు గ్రీనరీతో నిండుకొనడంతో ఈ పార్కుకే వెళుతున్నాం. గతంలో చెత్తాచెదారంతో ఉండే పార్కులను తెలంగాణ ప్రభుత్వం అందంగా తీర్చిదిద్దుతున్నది. కాలనీవాసులు ఎంతో సంతోషిస్తున్నారు.
– నీతిక, ప్రశాంత్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

