ముషీరాబాద్ : టీఎస్ఎస్పీడీసీఎల్ ఆజామాబాద్ డివిజన్ పరిధిలోని 11 కేవీ నారాయణగూడ, చిక్కడపల్లి, ప్రివెంటివ్ మెడిసిన్, ప్రేమ్‌నగర్ ఫీడర్ల పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ విజయభాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 10 గంటల నుంచి 12 వరకు నారాయణగూడ ఫీడర్ పరిధిలోని లింగంపల్లి, సూర్యానగర్, ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్, ఆరోరా డిగ్రీ కాలేజ్, దత్తానగర్, దీపక్ థియేటర్ పరిసరాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు చిక్కడపల్లి ఫీడర్ పరిధిలోని చిక్కడపల్లి, ఉమా గార్డెన్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, బాగ్‌లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రివెంటివ్ మెడిసిన్ ఫీడర్ పరిధిలోని నారాయణ గూడ, ప్రివెంటివ్ మెడిసిన్, బాగ్‌లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, రెడ్డి కాలేజ్, హెచ్ఆర్డీ కాలేజ్, కేశవ మెమోరియల్ స్కూల్ సరిసరాల్లో కరెంటు ఉండదు.
ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ప్రేమ్‌నగర్ ఫీడర్ పరిధిలోని పటేల్‌నగర్ చౌరస్తా, హనుమాన్‌టెంపుల్, ప్రేమ్‌నగర్, సుందర్బౌలి జంక్షన్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.