‘ఇన్స్పైర్ అవార్డ్స్’కు దరఖాస్తులు
విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు ఇన్స్పైర్ అవార్డ్స్ మానక్-2024 నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా విద్యాధికారి కె.రోహిణి తెలిపారు.
సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు ఇన్స్పైర్ అవార్డ్స్ మానక్-2024 నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా విద్యాధికారి కె.రోహిణి తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులతో గూగుల్ మీట్ నిర్వహించి ఇన్స్పైర్ అవార్డ్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి ధర్మేందర్ మాట్లాడుతూ.. ఇన్స్పైర్ అవార్డ్స్ మానక్ 2024-25 నామినేషన్స్ సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు.
ప్రతి పాఠశాలలో ఒక బాక్స్ ఏర్పాటు చేసి, సమస్య దాని పరిష్కారంపై వినూత్న ఐడియాలను రాసి ఆ బాక్స్‌లో వేయాలని కోరారు. ప్రతి పాఠశాల నుంచి ఉత్తమ 5 ఆలోచనలను ఎంపిక చేసి వాటిని ఇన్స్పైర్ అవార్డ్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ప్రతి పాఠశాల ఇండియన్ పోస్టాఫీసులో అకౌంట్ ఓపెన్ చేయాలని, ప్లేస్టోర్‌లో ఇన్స్పైర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కాగా ఈ మీట్లో 450 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

