ప్రాచీనం.. అమూల్యం
బేగంపేట పరిధి కుందన్‌బాగ్‌లో ఉండే రమేశ్ నిర్వహించే లీలా (ఆర్ఎస్) క్రాఫ్ట్స్.. పురాతన హస్తకళా వస్తువులు, విలువైన ఆధ్యాత్మిక సంపదకు కేంద్రంగా నిలుస్తున్నది. ఇందులో బెల్ మెటల్ (కంచు), కలంకారి, ఇక్కత్ వస్ర్తాలు, బనానా ఫైబర్, ఫైన్యాపిల్ ఫైబర్, జ్యూట్ వస్తువులు
- ప్రాచీన హస్తకళలను పరిరక్షిస్తున్న లీలా క్రాఫ్ట్స్
- 350 ఏండ్ల నాటి రాత ప్రతులు సేకరణ
- ఆధ్యాత్మిక వస్తువులను కాపాడుతున్న సంస్థ
అతను ఒకసారి శ్రీకాళహస్తి వెళ్లాడు. అక్కడ పెద్దమనిషి వివిధ రకాల చెక్క దువ్వెన్లు అమ్ముతూ కనిపించాడు. అప్పుడు వాటిని కొనాలనుకున్నా..వాయిదా వేశాడు. చాన్నాళ్ల తర్వాత తిరిగి అక్కడికి వెళ్లినపుడు చెక్కదువ్వెనలు కనిపించలేదు. అపుడే అతని మదిలో ఓ ఆలోచన వచ్చింది.ఇలాంటి వస్తువులను పరిరక్షించాలని సంకల్పించుకున్నాడు. అతని పేరు రమేశ్రామనాథన్. 34 ఏండ్లుగా ప్రాచీన, అమూల్యమైన వస్తువులను సేకరిస్తున్నాడు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : బేగంపేట పరిధి కుందన్‌బాగ్‌లో ఉండే రమేశ్ నిర్వహించే లీలా (ఆర్ఎస్) క్రాఫ్ట్స్.. పురాతన హస్తకళా వస్తువులు, విలువైన ఆధ్యాత్మిక సంపదకు కేంద్రంగా నిలుస్తున్నది. ఇందులో బెల్ మెటల్ (కంచు), కలంకారి, ఇక్కత్ వస్ర్తాలు, బనానా ఫైబర్, ఫైన్యాపిల్ ఫైబర్, జ్యూట్ వస్తువులు, పట్టుచీర, చేర్యాల బొమ్మలు, తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. గుహల్లో పెయింటింగ్‌కు వినియోగించిన 2500 ఏండ్ల నాటి రంగురాళ్లు, ఒడిస్సాలోని పూరీ ప్రాంతం నుంచి 350 ఏండ్ల నాటి రాతప్రతులు ఆయన సేకరించారు.
సంపూర్ణ రామాయణ గాథలను చిత్రించిన క్లాత్ కూడా ఉన్నట్లు చెప్పాడు. ఇవే కాకుండా తెలంగాణ ప్రాంతంలో దొరికే గిద్ద, సోల, తవ్వ, కుంచం లాంటి వస్తువులు సేకరించామని పేర్కొన్నారు. పంచలోహాల బొమ్మలు, ఇండోర్ కాగితం గుజ్జుతో చేసిన బొమ్మలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. శాగంతో తయారు చేసిన తాడు, 1970 దశకంలో కమలాదేవి చటోపాధ్యాయ లాంటి వారు రాసిల్క్‌తో తయారు చేసిన దుప్పట ఇక్కడ ఉంది. కళాపోషణ కోసం నాలుగు తరాల క్రితం ఉపయోగించిన హార్మోనియం ఎంతో అద్భుతంగా ఉన్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- ancient
- Begumpet
- handicraft
- mela
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

