Hydraa Victims | వెళ్లిపోండి అని తరుముతూనే ఉన్నరు.. మాకంత కర్మ ఏంటో.. అమీన్ పూర్ హైడ్రా కూల్చివేత బాధితురాలు
Hydraa Victims | ఇంత దౌర్జన్యం ఎక్కడా లేదని హైడ్రా అధికారుల తీరుపై అమీన్ పూర్ హైడ్రా కూల్చివేత బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా పొద్దున్న 6 గంటలకు వచ్చారు.. నిద్రలోనుండి లాక్కొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
Hydraa Victims | హైడ్రా అధికారుల అత్యుత్సాహంతో నిరాశ్రయులైన బాధితులు రేవంత్ సర్కార్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. రేపు ఆఫీస్‌కు వెళ్లాలంటే ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు ఎక్కడికెళ్లాలో కూడా తెలువడం లేదని అమీన్ పూర్ హైడ్రా కూల్చివేత బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
సదరు మహిళ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మేం సామాను కింద పెట్టుకుని ఉన్నం. మధ్యాహ్నం వరకు కూలగొడ్తమంటున్నరు. ఈ సామానంతా ఎక్కడ పెట్టుకోవాలి. మేం నిన్న అద్దె కూడా ఇచ్చాం. మాకు ఇప్పుడు ఇల్లు కూడా దొరకడం లేదు. మాకు ఉదయం 6 గంటలకు కాల్ వచ్చింది. మాకు ఎలాంటి సమాచారం లేదు. ఉంటే మేమెందుకు ఉంటం. అద్దెకుండేవాళ్లు అలాంటి రిస్క్ ఉంటదనుకున్నప్పుడు ఎందుకుంటరు ఇక్కడ. సొంతిల్లు అంటే ఫైట్ చేయాలనే ఆలోచన ఉంటది.
మేం అద్దె కట్టి రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా అన్యాయం. ఏదైనా ఉంటే ఓనర్స్‌తో ప్రభుత్వం తేల్చుకోవాలి.. కానీ జనాల మీద ఇలా చేయడమనేది కరెక్టు కాదు. మీరిప్పుడొచ్చి ఇప్పటికిప్పుడు సామాన్లు తీయాలంట ఎలా తీస్తం. మాకు కొంచెం టైం ఇవ్వాలి కదా.. వాళ్లు చెప్పగానే ఆలోచన రావాలి కదా.. పిల్లలున్నారు.. ఎక్కడికెళ్లాలి.. ఏం చేయాలి.. అంత టైం కూడా ఇవ్వకుండా వెంటనే వెళ్లిపోండి అని తరుముతూనే ఉన్నరు. అందరూ సర్దుకుంటూనే ఉన్నరు. మా బాల్కనీలు మొత్తం పగులగొట్టేశారు. మేమక్కడే నిల్చునే ఉన్నాం.. వాళ్లు పగులగొడుతూనే ఉన్నరు. మాకు చాలా భయమేసి బ్రతిమిలాడుకోవాల్సి వచ్చింది. మాకంత కర్మంటో అర్థం కావడం లేదంటూ వాపోయింది.
ఇంత దౌర్జన్యం ఎక్కడా లేదని హైడ్రా అధికారుల తీరుపై మరో బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా పొద్దున్న 6 గంటలకు వచ్చారు.. నిద్రలోనుండి లాక్కొచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వలేదు.. వీడియో తీస్తే తీసుకెళ్లి లోపల వేస్తున్నారంటూ వాపోయాడు.
మేము భవనం లోపలే ఉన్నాము, సర్దుకునే సమయం ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదు
ఉదయాన్నే 6 గంటలకు వచ్చి ఒక్కసారిగా ఖాళీ చేయమన్నారు
నోటీసులు కూడా లేకుండా కూల్చేశారు, మేము ఆఫీసుకు వెళ్లాలంటే ఎలా వెళ్ళాలి, ఇప్పటికిప్పుడు మాకు ఇల్లు ఎవరు ఇస్తారు? – అమీన్పూర్ హైడ్రా బాధితురాలు https://t.co/APOjZIABld pic.twitter.com/NL08xx4cte
— Telugu Scribe (@TeluguScribe) April 11, 2026
ఇంత దౌర్జన్యం ఎక్కడా లేదు
పొద్దున్న 6 గంటలకు వచ్చారు.. నిద్రలోనుండి లాక్కొచ్చారు
సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వలేదు.. వీడియో తీస్తే తీసుకెళ్లి లోపల వేస్తున్నారు – అమీన్పూర్ ప్రాంతంలో హైడ్రా బాధితులు https://t.co/Ax0Qj9AmVP pic.twitter.com/wkyRnz4waS
— Telugu Scribe (@TeluguScribe) April 11, 2026
పొద్దున 7 గంటలకు వచ్చి ఉన్నపళంగా ఖాళీ చేయమన్నారు
మీకు గంట సమయం ఇస్తాము ఖాళీ చేయమని చెప్పారు
నెలకు 20వేల కిరాయి కడుతూ, రెండు నెలల అడ్వాన్స్ కూడా ఇచ్చాము
కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా వచ్చి కూల్చేశారు – అమీన్పూర్ హైడ్రా బాధితురాలు https://t.co/W7ZYn8HYuN pic.twitter.com/Uh7UC1ewCS
— Telugu Scribe (@TeluguScribe) April 11, 2026
Read Also :
Youth OTT | విడుదలైన 15 రోజులకే ఓటీటీలోకి ‘యూత్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో అమర్చిన మైన్లను గుర్తించలేకపోతున్న ఇరాన్
Co-option Elections | రామగుండంలో కో-ఆప్షన్ ఎన్నికలకు వేళాయే.. నేడో, రేపో నోటిఫికేషన్ జారీ..!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

