భారీ వర్షం కురిసినా.. నీరు నిల్వదు
ఐటీ కారిడార్‌లోని ఓఆర్ఆర్ వెంబడి నిర్మించిన సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ తుది మెరుగులు దిద్దుకుంటున్నది. నగరానికి మణిహారంలా ఉన్న ఔటర్‌పై ఈ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. భారీ వర్షం కురిసినప్పుడు నగర రహదారులు జలమయమవుతాయి.
- అద్భుతంగా ఓఆర్ఆర్ సైకిల్ ట్రాక్ డిజైన్.. ట్రాక్ పొడవునా ప్రత్యేక వరద నీటి లైన్
సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఐటీ కారిడార్‌లోని ఓఆర్ఆర్ వెంబడి నిర్మించిన సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ తుది మెరుగులు దిద్దుకుంటున్నది. నగరానికి మణిహారంలా ఉన్న ఔటర్‌పై ఈ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. భారీ వర్షం కురిసినప్పుడు నగర రహదారులు జలమయమవుతాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంది. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఇంజినీరింగ్ అధికారులు సైకిల్ ట్రాక్ పొడవునా ప్రత్యేకంగా వరద నీటి కాలువను సుమారు 3.5 అడుగుల లోతు, 4 అడుగుల వెడల్పుతో నిర్మించారు.
వాన నీరు పారేందుకు..
రహదారులపై ఎంత భారీ వర్షం కురిసినా.. వెంటనే లోతైన కాలువలోకి వెళ్లేలా డిజైన్ చేసి నిర్మాణ పనులు చేపట్టారు. సైకిల్ ట్రాక్ నిర్మాణంతో పాటే వర్షపు నీరు పారేందుకు లోతైన కాలువను ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు లోపలి వైపు కట్టారు. దీంతో వర్షపు నీరు ఎన్ని కిలోమీటర్ల దూరం వెళ్లినా రోడ్ల మీదకు రాకుండా పల్లపు ప్రాంతాలకు పారేలా కాలువలను డిజైన్ చేశారు. ఓఆర్ఆర్ కింద ఉన్న అండర్‌పాస్‌ల కింద నుంచి మూసీలోకి వెళ్లే వరద కాలువల్లోకి వెళ్లేలా డిజైన్ చేసి నిర్మాణ పనులు చేపట్టామని హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.
23 కి.మీ పొడవునా సైకిల్ ట్రాక్
నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు కొత్తగా నిర్మించిన సైకిల్ ట్రాక్ పొడవు సుమారు 23. కి.మీ దాకా ఉంటుంది. ఓఆర్ఆర్ లోపలి వైపు ఉన్న సర్వీసు రోడ్డుపై ట్రాఫిక్ సైతం గణనీయంగా పెరగడంతో 2 వరసలు ఉన్న రోడ్డును 4 లేన్లుగా నిర్మించారు. ఇలా ఒకేసారి సర్వీసు రోడ్ల విస్తరణ, సైకిల్ ట్రాక్ నిర్మాణం పనులు ఏకకాలంలో చేపట్టారు. రోడ్లమీద వర్షపు నీరు నిలిచిపోయే సమస్య ఉత్పన్నం కాకుండా శాశ్వత పరిష్కారం చూపారు. సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణంలో సైకిలిస్టుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

