Air show : హైదరాబాద్ (Hyderabad) లో నిర్వహించిన ఎయిర్ షో (Air Show) అలరించింది. హుస్సేన్ సాగర్ (Hussain Sagar) పై భారత వాయుసేన (Indian Air Force) కు చెందిన సుశిక్షిత పైలట్లు విమానాలతో చేసిన విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి. సూర్యకిరణ్ విమానాల (Suryakiran Planes) తో ఈ విన్యాసాలు నిర్వహించారు. ఈ ఎయిర్ షోను వీక్షించేందుకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ ఎయిర్ షోను నిర్వహించారు. సెక్రెటేరియట్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు తదితరులు ఈ ఎయిర్ షోను తిలకించారు. విమానాలతో పైలట్లు ఆకాశంలో రంగురంగుల సింబల్స్ వేశారు. రెండు విమానాలతో వేసిన లవ్ సింబల్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. మొత్తం 15 సూర్యకిరణ్ విమానాలను ఈ ఎయిర్ షోకు ఉపయోగించారు.
Witnessing #hyderabad #airshow
Skies painted with wonder, engines roaring with dreams—today’s air show, a core memory etched forever.#IAFAirshow pic.twitter.com/k7nRg7y8Oz— Needhi Gattani (@gattani_needhi) December 8, 2024
Air Show in Hyderabad today on the occasion of Telangana Praja Palana by completing one year regime by Congress Govt@NewIndianXpress @XpressHyderabad @santwana99 @Kalyan_TNIE @TelanganaCMO @revanth_anumula pic.twitter.com/3Z5xUgHWh6
— Ireddy Srinivas Reddy (@ireddysrinivasr) December 8, 2024