హైదరాబాద్ టు లండన్.. ఎయిరిండియా నాన్‌స్టాప్ సర్వీసు
AirIndia | హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లే విమాన ప్రయాణికులకు శుభవార్త. ఇక నుంచి హైదరాబాద్ నుంచి లండన్‌కు నేరుగా విమానాలు నడపనున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. లండన్ నుంచి హైదరాబాద్ బయల్దేరిన

హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లే విమాన ప్రయాణికులకు శుభవార్త. ఇక నుంచి హైదరాబాద్ నుంచి లండన్‌కు నేరుగా విమానాలు నడపనున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. లండన్ నుంచి హైదరాబాద్ బయల్దేరిన నాన్‌స్టాప్ విమానం గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది. ఈ నాన్‌స్టాప్ విమానంలో మొత్తం 256 సీట్లు ఉంటాయి. ఇందులో 18 బిజినెస్ క్లాస్ కాగా, మిగతా 238 సీట్లు ఎకానమి క్లాస్.
సోమ, శుక్రవారాల్లో హైదరాబాద్ నుంచి
ప్రతి సోమ, శుక్రవారాల్లో హైదరాబాద్ నుంచి లండన్‌కు నాన్‌స్టాప్ విమాన సర్వీసులు నడవనున్నాయి. AI 147 విమానం హైదరాబాద్‌లో సోమవారం రాత్రి 1:30 గంటలకు బయల్దేరి, లండన్‌కు అదే రోజు ఉదయం 7:30 గంటలకు చేరుకోనుంది. AI 147 విమానం శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు బయల్దేరి, అదే రోజు ఉదయం 11:30 గంటలకు లండన్‌కు చేరుకోనుంది. లండన్ నుంచి AI 148 విమానం ప్రతి ఆది, గురువారాల్లో హైదరాబాద్‌కు బయల్దేరనుంది.
ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అమృత్సర్, కొచ్చి, అహ్మదాబాద్, గోవా నుంచి నేరుగా లండన్‌కు ఎయిరిండియా విమానాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో హైదరాబాద్ కూడా చేరింది. తదితర వివరాలకు www.airindia.in వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు. లేదా టోల్ ఫ్రీ నంబర్ 1860 233 1407 కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

