మియాపూర్, ఫిబ్రవరి 10 : తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ స్వర్ణ, వస్త్ర వ్యాపార సంస్థ సీఎంఆర్ మరో మాల్‌ను కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. శనివారం కూకట్‌పల్లిలో(కేపీహెచ్‌బీ పిల్లర్ నం. 771) వద్ద ఏర్పాటైన సీఎంఆర్ ఫ్యామిలీ మాల్‌ను నటి శ్రీలీల ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌లతో కలిసి ప్రారంభించారు.
శ్రీలీలను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఆమెతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. ఈ నూతన షాపింగ్ మాల్ ద్వారా మరో 300 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు సీఎంఆర్ అధినేత అల్లక సత్యనారాయణ తెలిపారు.