హైదరాబాద్ : ఓ యువకుడు కామంతో చెలరేగిపోయాడు. యువతి ముందే అసభ్యకరంగా ప్రవర్తించాడు. అమీర్‌పేట్ మెట్రో రైల్ స్టేషన్ లిఫ్ట్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ యువకుడు స్టేషన్ వద్దే ఉండి.. ఒంటరిగా వెళ్తున్న యువతిని అనుసరించాడు. ఆమె మెట్రో లిఫ్ట్ ఎక్కగానే అతను ఎక్కాడు. క్షణాల్లోనే ఆమె ముందు దుస్తులు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో షాకైన బాధితురాలు ఎస్ఆర్ నగర్ పోలీసులకు సమాచారం అందించింది.
నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ కామాంధుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఒడిశాకు చెందిన రాజు(19)గా పోలీసులు గుర్తించారు. అయితే తన ఫోన్లో అసభ్యకరమైన వీడియోలు చూస్తూ ఈ దారుణానికి పాల్పడినట్లు రాజు పోలీసుల విచారణలో తెలిపాడు. ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చిన రాజు.. ఎలాంటి పని దొరక్కపోవడంతో ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు తేలింది.