హైదరాబాద్ : బంజారాహిల్స్లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్ నంబర్ 2లో ట్రెండ్ సెట్ టవర్ వద్ద ఓ యువకుడిని వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో ఆ యువకుడు కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయమైంది. అపస్మారకస్థితిలోకి వెళ్లిన యువకుడిని చికిత్స నిమిత్తం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు నిమ్స్ వైద్యులు వెల్లడించారు.