బాలికపై అత్యాచారయత్నం
పదేండ్ల బాలికపై ఓ యాచకుడు అత్యాచారానికి యత్నించిన సంఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ మొగిలిచెర్ల రవి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లకుంట స్ట్రీట్ నంబర్ నాలుగు మూలమలుపు దగ్గర బాలిక(10)ను వెంకటేశ్(25) అనే యాచకుడు దగ్గరకు పిలిచాడు.
అంబర్‌పేట, జూన్ 13 : పదేండ్ల బాలికపై ఓ యాచకుడు అత్యాచారానికి యత్నించిన సంఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ మొగిలిచెర్ల రవి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లకుంట స్ట్రీట్ నంబర్ నాలుగు మూలమలుపు దగ్గర బాలిక(10)ను వెంకటేశ్(25) అనే యాచకుడు దగ్గరకు పిలిచాడు. వైట్నార్ తాగిన మత్తులో ఉన్న అతడు ఆ బాలికను అక్కడున్న రెండు కార్ల మధ్యలోకి లాక్కెళ్లి అత్యాచారయత్నానికి యత్నించాడు.
బాలిక కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకోవడంతో బాలికను విచక్షణారహితంగా కొట్టి కింద పడేసి తొక్కి పారిపోయాడు. దీంతో స్థానికులు నల్లకుంట పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఇన్స్పెక్టర్ రవి తీవ్రంగా గాయపడిన ఆ బాలికను చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. సంఘటన స్థలాల్లో ఉన్న సీసీటీవీ పుటేజీల ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కాచిగూడ పోలీసులు అతన్ని రైల్వేస్టేషన్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

