Congress Leader | రంగారెడ్డి : ఓ కాంగ్రెస్ నాయకుడు తన కోరికలు తీర్చాలంటూ ఓ మహిళను వేధింపులకు గురి చేశాడు. ఆ కామాంధుడి వేధింపులు భరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్షా కోట్లో ఓ వివాహిత నివాసం ఉంటోంది. ఆమె ఇంటికి సమీపంలోనే సుదర్శన్ అనే కాంగ్రెస్ నాయకుడు నివాసం ఉంటున్నాడు. అయితే ఆ వివాహితపై కన్నేసిన కాంగ్రెస్ నాయకుడు.. తన కోరికలను తీర్చాలంటూ వేధింపులకు పాల్పడుతున్నాడు. వివాహిత ఇంటి వైపు సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. ఆ సీసీ టీవీ ద్వారా ఆమె కదలికలను గమనిస్తూ ఫాలో అవుతున్నాడు. కామ వాంఛ తీర్చకపోతే ప్రాణాలు తీస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. పరుష పదజాలంతో దూషించడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, సైగలు చేస్తున్నాడు. కామాంధుడి వేధింపులు భరించలేని బాధితురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.