అబిడ్స్, ఆగస్టు 3: బ్యూటీ పార్లర్‌పై ఓ మహిళ అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హెయిర్ కలర్ కోసం అబిడ్స్‌లోని న్యూ క్వీన్ బ్యూటీ సెలూన్‌కు వెళ్లగా.. స్పెషల్ హెయిర్ ైైస్టెల్ చేస్తామని నా హెయిర్ మొత్తం ఊడి పోయేలా చేశారని బాధితురాలు వాపోయింది. పార్లర్ నిర్వాహకురాలు సొంతంగా తయారు చేసిన హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడమన్నారని, ఆ ఆయిల్ వాడితే తన జుట్టు పూర్తిగా రాలి పోయిందని, దువ్వెనతో దువ్వినా కూడా జుట్టు రాలిపోతున్నదని, జుట్టు పెరిగేలా చికిత్స చేయించాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.