హైదరాబాద్‌లో దారుణం.. నడిరోడ్డుపై భార్యను చంపిన భర్త
Hyderabad | లంగర్‌హౌస్ పోలీసు స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే, నడిరోడ్డుపై ఓ భర్త తన భార్యను నరికి చంపాడు.
హైదరాబాద్ : లంగర్‌హౌస్ పోలీసు స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే, నడిరోడ్డుపై ఓ భర్త తన భార్యను నరికి చంపాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. డిఫెన్స్ కాలనీలో నివాసం ఉంటున్న యూసుఫ్‌కు, కరీనా బేగంతో ఏడేండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. అయితే గతేడాది నుంచి యూసుఫ్, కరీనా మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో భార్యాభర్తలిద్దరూ విడివిడిగా ఉంటున్నారు.
అయితే కరీనా బేగం ఓ ప్రయివేటు స్కూల్లో టీచర్‌గా పని చేస్తుంది. తనను దూరం పెట్టిందన్న కోపంతో.. భార్యను మట్టుబెట్టాలని భర్త నిర్ణయించుకున్నాడు. కరీనా స్కూల్‌కు వెళ్తున్న సమయంలో.. ఆమెను అనుసరించి ఇనుప రాడ్‌తో తలపై బాదాడు. దీంతో ఆమె నడిరోడ్డుపైనే కుప్పకూలిపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనతో అప్రమత్తమైన స్థానికులు.. యూసుఫ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మహిళ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

