కేబుల్ వర్క్ చేయడానికొచ్చి.. బాత్రూమ్లో ఉన్న మహిళను చూసి పాడుపని..
Hyderabad | ఓ టెక్నీషియన్ నీచానికి పాల్పడ్డాడు. కేబుల్ వర్క్ చేయడానికొచ్చి ఓ మహిళపై కన్నేశాడు. సదరు మహిళ బాత్రూమ్లో ఉండగా.. వీడియో చిత్రీకరించి స్థానికులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన బంజారాహిల్స్ రోడ్

హైదరాబాద్ : ఓ టెక్నీషియన్ నీచానికి పాల్పడ్డాడు. కేబుల్ వర్క్ చేయడానికొచ్చి ఓ మహిళపై కన్నేశాడు. సదరు మహిళ బాత్రూమ్లో ఉండగా.. వీడియో చిత్రీకరించి స్థానికులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో చోటు చేసుకుంది. ఓ ఇంట్లో కేబుల్ నెట్ వర్క్ సరిగా పని చేయకపోవడంతో.. సంబంధిత నెట్ వర్క్‌కు ఫిర్యాదు చేశారు.
దీంతో ఆ నెట్వర్క్ టెక్నీషియన్ ఆ ఇంటికి వచ్చాడు. కేబుల్ వర్క్ చేస్తున్న టెక్నీషియన్‌కు పక్కింట్లో ఉన్న మహిళ బాత్రూమ్లో ఉన్న విషయాన్ని గ్రహించాడు. దీంతో అతను తన సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించాడు. దీన్ని గమనించిన స్థానికులు టెక్నీషియన్‌ను పట్టుకుని చితకబాదారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

