POCSO case | కన్నకూతురిపట్ల తండ్రి అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు
POCSO case | మద్యం మత్తులో కన్నకూతురిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు
బంజారాహిల్స్,మార్చి 27 : మద్యం మత్తులో కన్నకూతురిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్ పోలీస్స్టేషన్(Filmnagar Police Station) పరిధిలోని ఓ బస్తీలో నివాసం ఉంటున్న వ్యక్తి(39) గత కొంతకాలంగా మద్యానికి బానిసగా మారాడు. పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడంతో పాటు భార్య వద్దనుంచి డబ్బులు వసూలు చేసి రోజంతా తాగుతూ అవారగా తిరుగుతున్నాడు.
కాగా రెండ్రోజుల క్రితం మద్యం మత్తులో ఉన్న వ్యక్తి స్కూల్ నుంచి వచ్చిన తన కుమార్తె(7)ను దగ్గరకు పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైంగికదాడికి యత్నించాడు. దీంతో బాలిక అక్కడినుంచి పరిగెత్తి బయటకు వెళ్లింది. సాయంత్రం తల్లి ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని చెప్పడంతో ఆమె ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోక్సో చట్టం (POCSO )కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్కు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

