ఆటోలోనే సూట్‌కేస్‌ను మరిచిన ప్రయాణికుడు.. 2 గంటల్లోనే ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ : ఓ ప్రయాణికుడు ఉబెర్ ఆటోలో ఇంటికి వెళ్తూ.. ఆ వాహనంలోనే సూట్‌కేస్‌ను మరిచిపోయాడు. ఇంటికి వెళ్లిన తర్వాత సూట్‌కేస్ మరిచిపోయానన్న విషయాన్ని సదరు ప్రయాణికుడు గ్రహించాడు. అప్రమత్తమైన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు 2 గంటల్లోనే ఆ ఆటోను కనిపెట్టి, బాధిత వ్యక్తికి సూట్‌కేస్‌ను అప్పగించారు.
వివరాల్లోకి వెళ్తే.. సైదాబాద్ పరిధిలోని లక్ష్మీనగర్‌కు చెందిన మహేందర్ రెడ్డి ఉబెర్ ఆటో బుక్ చేసుకుని పీర్జాదిగూడ నుంచి ఇంటికి చేరుకున్నాడు. అయితే అతని వెంట ఉన్న సూట్‌కేస్‌ను ఆటోలోనే మరిచిపోయాడు. దీంతో సైదాబాద్ క్రైమ్ పోలీసులకు బాధిత వ్యక్తి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆటో నెంబర్ ఆధారంగా డ్రైవర్‌ను పోలీసులు గుర్తించారు. అలా.. రెండు గంటల్లోనే ఆటోను కనిపెట్టి.. అందులో ఉన్న సూట్‌కేస్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సూట్‌కేస్‌లో రూ. లక్ష విలువైన పట్టు చీరెలు ఉన్నట్లు మహేందర్ రెడ్డి తెలిపాడు. తన సూట్‌కేస్‌ను అప్పగించిన క్రైం పోలీసులకు మహేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

