హైదరాబాద్ : షేక్‌పేట(Shakepet)లోని ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం(Fire broke) చోటు చేసుకుంది. ఫుట్‌పాత్‌పై ఉన్న దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది(Firefighters)కి సమా చారమందించారు. సకాలంలో చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.