Diamonds | వజ్రాలు దొంగలించిన వ్యక్తిపై కేసు నమోదు
Diamonds | పనిచేస్తున్న ఇంట్లో వజ్రాభరణాలు(Diamonds) తస్కరించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదయింది.
బంజారాహిల్స్,మార్చి 29 : పనిచేస్తున్న ఇంట్లో వజ్రాభరణాలు(Diamonds) తస్కరించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే..బంజారాహిల్స్ రోడ్ నెం 12లో నివాసం ఉంటున్న యష్ లల్వానీ అనే వ్యాపారి ఇంట్లో మూడేళ్లుగా బీహార్‌కు చెందిన సాహెబ్ కుమార్(21) పని మనిషిగా చేస్తున్నాడు. ఇటీవల యష్ లల్వానీ తల్లికి చెందిన 3 వజ్రపు ఉంగరాల జతలు బీరువాలో పెట్టారు. పదిరోజుల తర్వాత చూడగా బీరువాలో పెట్టిన ఉంగరాలు కనిపించలేదు.
అన్ని ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో సీసీ ఫుటేజీలను పరిశీలించడంతో పనిమనిషి సాహెబ్ కుమార్ గదిలోకి వెళ్లినట్లు కనిపించింది. దీంతో అతడిపై అనుమానం వ్యక్తం చేస్తూ యష్ లల్వానీ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐపీసీ 381 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

