పాతకక్షలతో కర్రలతో వృద్ధుడిపై దాడి..వ్యక్తులపై కేసు
కర్రలతో దాడి | పాతకక్షలతో కర్రలతో దాడికి పాల్పడ్డ ముగ్గురిమీద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

బంజారాహిల్స్,సెప్టెంబర్ 8 : పాతకక్షలతో కర్రలతో దాడికి పాల్పడ్డ ముగ్గురిమీద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని సయ్యద్‌నగర్‌లో నివాసం ఉంటున్న సయ్యద్ నయీమ్ అనే వ్యాపారి ఇంటిపక్కన సోదరుడు సయ్యద్ దస్తగిరి ఉంటాడు.
జూలై నెలలో తానుంటున్న ఇంట్లో అక్రమంగా కరెంట్ కనెక్షన్ తీసుకుంటున్న దస్తగిరి గురించి నయీమ్ విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దాంతో కనెక్షన్ ఇవ్వకుండా అధికారులు నిలిపివేశారు. తన ఇంట్లో కరెంట్ కనెక్షన్ తీసుకోకుండా నయీమ్ అడ్డుపడ్డాడన్న కక్షను పెంచుకున్న దస్తగిర్ రెండ్రోజుల క్రితం అకారణంగా నయీమ్‌తో గొడవకు దిగాడు.
మాటామాటా పెరగడంతో దస్తగిరి, సోదరుడు సలీమ్, సయ్యద్ అమీర్ అనే వ్యక్తులతో కలిసి నయీమ్‌పై కర్రలతో దాడికి దిగారు. దాడిలో నయీమ్‌తో పాటు సయ్యద్ జానీ అనే వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ మేరకు నయీమ్ ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

