ఇంటి ఆవరణలో.. నీటి గుంతలో పడి..బాలుడి దుర్మరణం
ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు పక్కింటి ఆవరణలో ఉన్న నీటి గుంతలో పడి మృతిచెందిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యవటం గ్రామానికి చెందిన రాయుడు భీంశంకర్, లావణ్య దంపతులు ఏడేండ్ల కిందట బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చారు.
బంజారాహిల్స్, మే 2 : ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు పక్కింటి ఆవరణలో ఉన్న నీటి గుంతలో పడి మృతిచెందిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యవటం గ్రామానికి చెందిన రాయుడు భీంశంకర్, లావణ్య దంపతులు ఏడేండ్ల కిందట బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.45లోని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్‌లో భీంశంకర్ వాచ్‌మన్‌గా పనిచేస్తూ.. అదే భవనంలో కింద భార్య లవకుమారితో పాటు కుమార్తె శ్రీలలిత, కొడుకు వివేకానంద(7)తో కలిసి నివాసముంటున్నాడు. పిల్లలిద్దరూ సమీపంలోని మస్తాన్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. కాగా వేసవి సెలవులు కావడంతో పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉన్నారు.
ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం అక్కాతమ్ముడు ఆడుకునేందుకు పక్కనే ఖాళీ ప్లాట్ నం.862లో ఉండే వాచ్‌మన్ పిల్లల వద్దకు వెళ్లారు. కాగా నలుగురు పిల్లలు కలిసి ఆడుకుంటుండగా ఆ ప్లాట్‌లో ఓ మూలకు ఉన్న గుంతలో ఇటీవల కురిసిన వర్షంతో నాలుగు అడుగులమేర నీరు నిండింది. ఈ క్రమంలో ఆడుకుంటూ నీటి గుంతలో పడిన కర్రను తీసుకువచ్చేందుకు వివేకానంద నీటిగుంత వద్దకు వెళ్లగా కాలుజారి గుంతలో పడిపోయాడు. దీంతో అతడితో పాటు అడుకుంటున్న పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి బాలుడి కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు అక్కడికి చేరుకునేలోపే వివేకానంద మృతి చెందాడు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా సంఘటనపై జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. త్వరలో పుట్టిన రోజు కోసం బట్టలు తీసుకున్నామని వాటిని వేసుకుంటానని రోజూ కొడుకు మారం చేస్తున్నాడని, ఈలోపే ఘోరం జరిగిపోయిందంటూ తల్లి లవకుమారి రోధించడం అక్కడున్నవారిని కలిచివేసింది.
ప్లాట్ యజమానిపై చర్యలు తీసుకోవాలి
ఖాళీ ప్లాట్‌లో గుంతను తవ్వి నిర్లక్ష్యంగా వదిలేసి బాలుడి మృతికి కారణమైన స్థలం యజమానిపై చర్యలు తీసుకోవాలని బాలుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు నచ్చజెప్పడంతో బాలుడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- boy died
- water hole
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

