మున్సిపాలిటీల విలీనం
రంగారెడ్డి జిల్లా ఉనికి లేకుండా చేసే కుట్రలో భాగంగానే శివారు మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేయడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధం అవుతోందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, మణికొండ, నార్సింగి, బండ్లగూడజాగీర్, బడంగ్పేట్, తుక్కుగూడ, ఆదిబట్ల, పెద్దఅంబర్‌పేట, తుర్కయంజాల్ మున్సిపాలిటీలను గ్రేటల్లో విలీనం చేసి జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలను రాజకీయంగా దెబ్బతీయడంతో పాటు జిల్లా పేరు లేకుండా చేయాలని చూస్తున్న కాంగ్రెస్ కుట్రలను ప్రజలు గమనించాలన్నారు.
- అర్థరహితం ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యేలు సబిత, వివేకానంద ధ్వజం
శంషాబాద్ రూరల్, నవంబర్ 26: రంగారెడ్డి జిల్లా ఉనికి లేకుండా చేసే కుట్రలో భాగంగానే శివారు మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేయడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధం అవుతోందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, మణికొండ, నార్సింగి, బండ్లగూడజాగీర్, బడంగ్పేట్, తుక్కుగూడ, ఆదిబట్ల, పెద్దఅంబర్‌పేట, తుర్కయంజాల్ మున్సిపాలిటీలను గ్రేటల్లో విలీనం చేసి జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలను రాజకీయంగా దెబ్బతీయడంతో పాటు జిల్లా పేరు లేకుండా చేయాలని చూస్తున్న కాంగ్రెస్ కుట్రలను ప్రజలు గమనించాలన్నారు. అలాగే బీసీ రిజర్వేషన్ల పెంపు లేకుండానే స్థానిక ఎన్నికలకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో తగ్గిన బుద్ధి చెప్పాలని సబితారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. త్వరలో మున్సిపాలిటీల విలీనంపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని స్పష్టం చేశారు.
హైదరాబాద్, నవంబర్ 26(నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం అర్థరహితం, అవివేకమని శాసనసభ బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటీలను విలీనం చేయడంలో ప్రజాశ్రేయస్సు లేదని, రాజకీయ ప్రయోజనం మాత్రమే దాగి ఉన్నదని ధ్వజమెత్తారు. ఎలాంటి అధ్యయనం లేకుండా, అశాస్త్రీయమైన పద్ధతులో క్యాబినెట్ తీసుకున్న విలీన నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు.విలీనం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని ఆరోపించారు. కేసీఆర్ మున్సిపాలిటీ అధికారం వికేంద్రీకరిస్తే.. రేవంత్‌రెడ్డి మాత్రం కేంద్రీకృతం చేస్తున్నాడని విమర్శించారు. శివారు ప్రాంతాల్లో పాలనను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. విలీన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోకపోతే బీఆర్ఎస్
తరుపున ఆందోళనలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

