Hyderabad Metro | అంతన్నారు… ఇంతన్నారు… ఆఖరుకు అత్తెసరుతో సరిపెట్టారు.. మెట్రో విస్తరణకు 1100 కోట్లే
అంతన్నారు... ఇంతన్నారు... ఆఖరుకు అత్తెసరుతో సరిపెట్టారు. బడ్జెట్లో కేటాయించిన నిధులు ప్రతిపాదిత మెట్రో కారిడార్ల విస్తరణలో ఆస్తుల సేకరణకే సరిపోని పరిస్థితి. ఆర్భాటంగా ప్రచారాలు చేసి హడావుడిగా శంకుస్థాపనలు చేసి కొండంత రాగం తీసిన ప్రభుత్వం తీరా బడ్జెట్లో మాత్రం అరకొరగా ప్రకటించి చేతులు దులుపుకున్నది.
- మెట్రో విస్తరణకు 24042 కోట్లు అవసరం
- సర్కారు ప్రకటించింది 1100 కోట్లే
- ఆస్తుల సేకరణకే ఆ నిధులు చాలవు
- ఇంకా కావలసింది 22,942 కోట్లు
Hyderabad Metro | సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): అంతన్నారు… ఇంతన్నారు… ఆఖరుకు అత్తెసరుతో సరిపెట్టారు. బడ్జెట్లో కేటాయించిన నిధులు ప్రతిపాదిత మెట్రో కారిడార్ల విస్తరణలో ఆస్తుల సేకరణకే సరిపోని పరిస్థితి. ఆర్భాటంగా ప్రచారాలు చేసి హడావుడిగా శంకుస్థాపనలు చేసి కొండంత రాగం తీసిన ప్రభుత్వం తీరా బడ్జెట్లో మాత్రం అరకొరగా ప్రకటించి చేతులు దులుపుకున్నది. ప్రభుత్వం విస్తరించాలనుకున్న 78.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో కారిడార్లకు గాను అవసరమైన వ్యయం 24,042 కోట్ల రూపాయలు. కానీ బడ్జెట్లో మాత్రం కేవలం 1100 కోట్లు కేటాయించారు.
వ్యయానికి కేటాయింపులకు పొంతనేదీ?
గత కేసీఆర్ ప్రభుత్వం 2023 బడ్జెట్లో మెట్రో విస్తరణకు రూ.2500 కోట్లను కేటాయించి రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు పనులు మొదలు పెట్టింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేసింది. మెట్రో రెండో దశ ప్రతిపాదనలను సమీక్షించి వాటిని సవరించి కొత్త ప్రతిపాదనలను రూపొందించింది. ఇందులో భాగంగా 78.4 కిలోమీటర్ల పొడవైన కొత్త మెట్రో కారిడార్‌ను 24,042 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయిచింది. మెట్రో రైలును పాత నగరానికి 5.5 కిలోమీటర్ల మేర పొడిగించి దాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానం చేయాలని ప్రణాళిక రచించారు.
ఎల్బీనగర్ నుండి నాగోలుకు 7 కిలోమీటర్ల మేర కారిడార్‌ను విస్తరించాలని, నాగోలు, ఎల్బీనగర్, చంద్రాయణగుట్ట స్టేషన్లను ఇంటర్ చేంజ్ స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మియాపూర్ నుండి పటాన్ చెరువుకు 14 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సౌకర్యాన్ని పొడిగించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ ఒక్క పాతనగరంలోనే దాదాపు 1100 ఆస్తులను సేకరించాల్సి ఉంది. వీటికే దాదాపుగా 2వేల కోట్లు అవసరమవుతాయని అంచనా. 24వేల కోట్లకు పైగా వ్యయమయ్యే మెట్రో పనుల విస్తరణపై ఆర్భాటంగా ప్రకటనలు చేసి కేవలం 5 శాతం మాత్రమే నిధులు సమకూరిస్తే పనులు ముందుకు సాగేది ఎలా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

