ORR | ఓఆర్ఆర్ సైకిల్ ట్రాక్‌పై కిరాయి సైకిళ్లు.. గంటకు రూ.50
ఔటర్ రింగు రోడ్డు సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ మీద సైకిళ్లు దూసుకుపోతున్నాయి. నగరంలో సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు వెంబడి 24 కి.మీ మేర అంతర్జాతీయ ప్రమాణాలతో సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్‌ను నిర్మించారు.
- నార్సింగి హబ్‌లో 200 సైకిళ్లు
ORR | సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : ఔటర్ రింగు రోడ్డు సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ మీద సైకిళ్లు దూసుకుపోతున్నాయి. నగరంలో సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు వెంబడి 24 కి.మీ మేర అంతర్జాతీయ ప్రమాణాలతో సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్‌ను నిర్మించారు. అంతేకాకుండా ప్రత్యేక చొరవ తీసుకొని సైకిల్ ట్రాక్ మీద సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు దాని వెలుతురులో హాయిగా సైక్లింగ్ చేసుకునే సైక్లింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. సొంత సైకిళ్లు ఉన్న వారు నేరుగా ఈ ట్రాక్‌పై సైక్లింగ్ చేసే అవకాశం ఉండగా, లేని వారి కోసం అద్దెకు సైకిల్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం మొదటి సైకిల్ స్టేషన్‌ను నార్సింగి హబ్‌లో ఏర్పాటు చేసి సుమారు 200 సైకిళ్లను అందుబాటులో ఉంచగా, అందులో 40కి పైగా ఎలక్ట్రిక్ సైకిళ్లు సైతం ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. అద్దెకు ఇచ్చే సైకిల్‌కు గంటలకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో సైకిల్ స్టేషన్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. 24కి.మీ ఓఆర్ఆర్ సైకిల్ ట్రాక్‌పై 4 చోట్ల సైకిల్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, అందులో తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్, నానక్‌రాంగూడ, నార్సింగి, కొల్లూరు ప్రాంతాలను సైకిల్ స్టేషన్ల కోసం ఎంపిక చేసి అక్కడ మౌలిక వసతులు కల్పించారు. ప్రస్తుతం నార్సింగి హబ్‌లో సైకిళ్లు అద్దెకు అందుబాటులో ఉండగా, త్వరలోనే మిగతా ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

