విజయ డెయిరీకి మరో 2వేల ఔట్లెట్లు
మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన డెయిరీ, ఫుడ్ ఎక్స్ పో- 2023ను హోం మంత్రి మహమూద్ అలీ తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ సోమ భరత్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు.
- ఎక్స్ పోను ప్రారంభించిన హోం మంత్రి
మాదాపూర్, ఫిబ్రవరి 3: మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన డెయిరీ, ఫుడ్ ఎక్స్ పో- 2023ను హోం మంత్రి మహమూద్ అలీ తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ సోమ భరత్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ … నగరానికి ప్రతి రోజు కోటి లీటర్ల పాలు అవసరమవుతాయని, కానీ 60 నుంచి 70 లక్షల లీటర్లు ఉత్పత్తి మాత్రమే అవుతున్నదన్నారు. టీఎస్‌డీడీసీఎఫ్ చైర్మన్ సోమ భరత్ మాట్లాడుతూ … విజయ డెయిరీ ఒకప్పుడు సరిగా నడవక మూత పడుతుందేమోన్న స్థితికి వచ్చిందని, కానీ ఎవరూ ఊహించనంత గొప్పగా ఎదిగిందని చెప్పారు.
రూ. 7 వందల కోట్ల టర్నోవర్ సాధించి వెయ్యి కోట్ల లక్ష్యంతో ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయ డెయిరీ మరో 2 వేల ఔట్లెట్లను జోడించేందుకు సిద్ధమవుతున్నదని, ప్రస్తుతం వెయ్యి అవుట్ లెట్లను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 27 రకాల ఉత్పత్తులు ఉండగా మిల్క్ షేక్, కాఫీ, టీ, ఫ్లేవర్డ్ మిల్క్, ఐస్ క్రీం, కుల్ఫీ, కుకీలు, హెల్త్ బార్లు మొదలైన 100 రకాల కొత్త ఉత్పత్తులను జోడించనున్నట్లు తెలిపారు. మారుమూల ప్రాంతాల్లోని అత్యవసర పరిస్థితుల ఆధారంగా త్వరితగతిన నిర్వహించే యానిమల్ మొబైల్ మెడికల్ అంబులెన్స్‌లు వందల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయని, టోల్ ఫ్రీ నంబర్ 1962 అంబులెన్స్ సేవలకు కనెక్టివిటీని అందిస్తుందన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

